Kantara: ఓటీటీలో కాంతార.. స్ట్రీమింగ్ అందులోనేనా?

Kantara: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా కన్నడ చిత్రం ‘కాంతార’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. కన్నడలో మంచి హిట్ అందుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వెర్షన్‌లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా కాంతార సినిమాను ఈనెల 15వ తేదీన రిలీజ్ చేశారు. టాలీవుడ్‌లోనూ కాంతార సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.

దీంతో కాంతార సినిమా టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ పొందింది. భారీ వసూళ్లు రాబట్టడంతో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సైతం కాంతార సినిమా వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. చిన్న సినిమాగా రిలీజైన కాంతార.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఇండస్ట్రీ షేక్ చేస్తోంది. కాంతార సినిమా మంచి కలెక్షన్లతో దూసుకెళ్లడంతో.. ప్రస్తుతం దీపావళి కానుకగా విడుదల కావాల్సిన సినిమాలకు థియేటర్ల దొరకడం లేదు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రిలీజ్ డేట్ ఎప్పుడనే విషయంపై ప్రేక్షకులు ఎంతగానో వేచిచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ‘కాంతార’ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ సినిమాని నిర్మించారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -