White sugar: వైట్ షుగర్ తింటున్నారా.. అయితే ఇక అంతే సంగతులు?

White sugar: వైట్ షుగర్ లేదా తెల్ల చక్కెర ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది. ఈ వైట్ షుగర్ ని కాఫీలు టీలతో పాటు స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ వైట్ షుగర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే వైట్ షుగర్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. మరి వైట్ షుగర్ తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెల్ల చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంది.

షుగర్ తీసుకోవడం వల్ల ఊబకాయం మరింత పెరుగుతుంది. దాంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ప్రాసెస్ షుగర్ టైప్ 2 డయాబెటిస్ కీ కారణం అవుతుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. మీరు చక్కెర తిన్నప్పుడల్లా ఇది కాలేయం పనిని పెంచుతుంది. అది ఒత్తిడికి లోనవుతుంది. ఈ కారణంగా శరీరంలో లిపిడ్లు అధికంగా ఏర్పడటం ప్రారంభిస్తాయి. కాలేయ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మరి రోజూ టీ, కాఫీలు తీసుకొనే వారు చక్కెర వాడకుండా ఉండలేరు. అందుకే పురుషులు, మహిళలు తక్కువ స్థాయిలో మాత్రమే షుగర్ తీసుకోవాలి. మహిళలు రోజుకు 6 స్పూన్లు, పురుషులు రోజుకు 9 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి.

 

అయితే ప్రతిసారి చక్కెరను ఉపయోగించుకోకుండా చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం మంచిది. శరీరంలోని చక్కెర కొరత తీర్చడానికి బెల్లం ఉపయోగపడుతుంది. శరీరం శక్తిని పొందడానికి బాడీకి గ్లూకోజ్ అవసరం. అయితే, గ్లూకోజ్ పొందడానికి చక్కెరను ప్రాసెస్ చేయడం సరైంది కాదు. శరీరానికి అవసరైన గ్లూకోజ్ ను బెల్లం ద్వారా పొందవచ్చు. శరీరంలో ఇన్సులిన్ అనేది చాలా ముఖ్యమైనది. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -