Congress President: కాంగ్రెస్‌కు కొత్త దళపతి ఎవరు.. తేలేది నేడే..

Congress President: కాంగ్రెస్ లో అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 22 ఏళ్ల తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుండటంతో అందరి చూపు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలపై పడింది. నేడే అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ నేతలు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన శశిథరూర్ తో పాటు మల్లిఖార్జున ఖర్గే పోటీలో ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులిద్దరూ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రచారం చేశారు., కాంగ్రెస్ నేతలను కలిసి అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. నేడు సాయంత్రం వరకు నేతలు ఓట్లు వేయనుంగా.. రాత్రి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.

మల్లిఖార్జున ఖర్గేకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎక్కువమంది నేతల సపోర్ట్ ఆయనకే ఉండటంతో ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంచణంగా తెలుస్తోంది. ఆయన పేరు అధ్యక్షుడిగా ప్రకటించడమే తరువాయి అని చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలు, సీనియర్ నేతల అండ మల్లిఖార్జున ఖర్గేకే ఎక్కువగా ఉంది. కర్ణాటకకు చెందని మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ లో శశిథరూర్ కంటే చాలా సీనియర్ నేగా ఉన్నారు. ఇందిరాగాంధీ హాయాం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా పనిచేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో రాజ్యసభ ప్రతిపక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో ఎప్పటినుంచో కొనసాాగుతున్నా.. సోనియా గాంధీ ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చి రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించారు. మల్లిఖార్జున ఖర్గేకే కర్ణాటక సీఎంగా ఎన్నోసార్లు అవకాశం వచ్చి చివరి నిమిషంలో మిస్ అయింది. సామాజిక సమీకరణలో భాగంగా వేరే వారిని ఇచ్చారు. ఎప్పటినుంచో పార్టీ ఉన్నా… సీఎం పదవి ఇవ్వంపై కాంగ్రెస్ పై ఆయన ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీకి కట్టుబడి ఉండి నమ్మకంగా పనిచేస్తూ వస్తున్నారు.

సోనియాగాంధీ, రాహుల్ లకు వీరవిధేయుడిగా మల్లిఖార్జున ఖర్గే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం సోపోర్టుతోనే ఆయన అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీలోకి దిగాల్సిందిగా స్వయంగా ఖర్గేకు సోనియా గాంధీ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఖర్గే కంటే ముందు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేయాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు సోనియాగాంధీ సూచించారు. కానీ రాజస్థాన్ తర్వాతి సీఎం పదవి ఎవరనే విషయంలో సచిన్ పైలెట్ తో విబేధాలు రావడంతో.. ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ వద్దని అగ్రనాయకత్వం సూచించింది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు 10 వేల మంది డెలిగేట్లు ఉన్నారు. వీరు రేపు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ తన ఓటు హక్కును కర్ణాటకలో ఉపయోగించుకోనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 20న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయలంలో జరుగుతుంది. మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే సౌత్ ఇండియాకు చెందిన నేత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కానున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -