Srireddy: నువ్వు ఎవరికీ నచ్చలేదు కాబట్టి గెలకలేదేమో.. రోజాపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Srireddy: తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వరకు ఈమె సుపరిచితమే. శ్రీరెడ్డి తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో, వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీ రెడ్డి బాగా పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుంచీ ఏదో ఒక విషయంలో ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తనకు సంబంధం లేని విషయాలు లో కూడా ఆమె కలుగజేసుకొని మాట్లాడి లేనిపోని వివాదాలను తెచ్చుకుంటూ ఉంటుంది.

అంతేకాకుండా సమాజంలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్స్ ను సైతం ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి, హీరోయిన్ కీర్తిసురేష్ తో చనువుగా ఉండడంతో కూతురు వయసు ఉన్న నటితో అలా ప్రవర్తించడం సిగ్గుగా లేదా అంటూ మండిపడిన విషయం తెలిసిందే. కాగా శ్రీరెడ్డి ఈరోజు ఏపీ మంత్రి సీనియర్ సినీనటి రోజాపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. గతంలో రోజా కాస్టింగ్ కౌచ్ అనేది లేదని వ్యాఖ్యలు చేసిందట. ఆ వాఖ్యలకు శ్రీ రెడ్డి కౌంటర్స్ వేసింది.

 

రోజా సినిమా పరిశ్రమ లో 27 ఏళ్లు ఉందేమో, అన్ని ఏళ్లలోనూ ఆమెను ఎవ్వ‌రూ గెలక లేదు అంటే ఈ బ్యూటీ ఎవడికి నచ్చలేదేమో, అయిన ఆ ముఖాన్ని ఎవడు గెలుకుతాడు. అసలు కొంపదీసి ఈమెనే ఎవడినైనా గోకితే పట్టించుకోలేదేమో అంటూ శ్రీరెడ్డి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి రోజాపై చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హ‌ల్చల్ చేస్తున్నాయి. కాగా తరచూ వైసీపీకి మద్దతుగా మాట్లాడే శ్రీరెడ్డి వైసీపీ మంత్రి అయిన రోజాపై ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -