Roja: వైరల్ అవుతున్న రోజా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Roja: విజయవాడ బాపు మ్యూజియంలో లేజర్ సౌండ్ లైట్ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఛీ కొడితే షర్మిల ఏపీలోకి వచ్చారని చెప్పారు. విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని పెట్టామని, బాబు మ్యూజియం భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు.

 

వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించాక షర్మిల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ పై ఇప్పటికే పలుసార్లు విరుచుకుపడ్డారు. షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డూ డూ బసవన్న మాదిరి వచ్చారు. స్థానికత లేని పార్టీలను ప్రజలు నమ్మరు పక్క రాష్ట్రంలో పార్టీ తీసేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు.

ఎంత రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని చెప్పుకు తిరిగినా వైయస్సార్ అభిమానులంతా సీఎం జగన్ వెంటే ఉంటారు. జగన్ కు ఇక్కడ అడ్రస్, గుర్తింపు, ఓటు అన్నీ ఉన్నాయి అని ధీమా వ్యక్తం చేశారు రోజా. షర్మిల లాంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలు ఆదరించరు. సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తారు జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు.

 

గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరు ఆపలేరు. నాన్ లోకల్ పొలిటిషియన్స్ ఇక్కడ ఉండరు, పట్టించుకోరు రాజన్న బిడ్డగా ప్రజలకు రాజన్న రాజ్యం అందించడానికి జగన్ కాంప్రమైజ్ కాలేదన్నారు. ఏపీలో ఓటు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్ కి లేదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -