JanaSena: మౌనం ఎందుకు పవన్.. ఆ విషయాల గురించి స్పందిస్తారా?

JanaSena: ప్రస్తుతం జనసేన నేత పవన్ కళ్యాణ్ మౌనం పై రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా పవన్ ప్రవర్తనా తీరు పార్టీ నాయకులకు కూడా అంతు పట్టడం లేదు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా బిజెపి నుంచి ముస్లింలకు ఏదైనా ఇబ్బంది కలిగిన తాను అండగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారు ఆ హామీలు ఎక్కడికి పోయాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేయిస్తాము అని ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సంచలన ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి వస్తే ఏపీలో కూడా ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముస్లింల‌కు సంబంధించి ప‌వ‌న్‌ చేసిన భ‌రోసా ప్ర‌క‌ట‌న గురించి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ముస్లింల జోలికి వ‌స్తే ఊరుకోన‌ని, మైనార్టీల‌కు అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్‌ హామీ ఇచ్చిన మాటలను ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ పవన్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు? బిజెపితో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన సమయం వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమిత్‌షా చేసిన ప్రకటనపై పవన్ ఎందుకు స్పందించడం లేదు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

 

ఈ విషయం పట్ల స్పందించకపోవడంతో పవన్ మౌనం అంగీకారం అనుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ముస్లింల రిజ‌ర్వేష‌న్‌పై బీజేపీ మ‌నోగ‌తం ఏంటో అర్థ‌మైన త‌ర్వాత కూడా ప‌వ‌న్ మౌనంగా ఉన్నారు అంటే పవన్ భయపడుతున్నారని అనుకోవాలా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ముస్లింలను శ‌త్రువులుగా చూస్తోంద‌న్న‌ది వాస్త‌వం. క‌ర్నాట‌క‌లో ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ను ఆ రాష్ట్ర బీజేపీ ప్ర‌భుత్వం ఇప్పటికి రద్దు చేసిన విషయం తెలిసింది. అలాగే ప్ర‌స్తుతం రిజ‌ర్వేష‌న్ ర‌ద్దుపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ముస్లింల‌ను ఈ దేశ పౌరులే కాద‌న్న‌ట్టుగా మోదీ స‌ర్కార్ అణ‌చివేత చ‌ర్య‌లు చేపట్టింద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారో లేదో చూడాలి మరి..

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -