Akkineni Akhil: అఖిల్ సినిమాకు అంత మార్కెట్ ఉందా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక్కో కుటుంబానికి సంబంధించి.. ఒక్కో హీరో సినిమాల్లో అడుగు పెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ఇదే క్రమంలో స్టార్ హీరో స్థాయికి ఎదిగి 100 కోట్ల రూపాయల మార్కెట్ ని కూడా.. తమ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద ఒక వెలుగు వెలుగుతున్నారు.

ఇక ఈ విషయంలో అక్కినేని హీరోలు కొంచెం వెనకబడి ఉన్నారని చెప్పవచ్చు. అక్కినేని హీరోలు సినిమా విజయాలు అందుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ రేంజ్ లో సంచలనాలు సృష్టించలేకపోతున్నారు. అక్కినేని వారసుల సినిమాల్లో ఏ ఒక్కటి కూడా 60 కోట్లకు మించి కలెక్షన్ల మార్కెట్ పెరగలేదు. ఇటీవల విడుదలైన బంగార్రాజు సినిమా మనందరికీ తెలిసిందే

ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్యలు ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమాకు హిట్ టాక్ లభించినప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం 50 కోట్లు కూడా రాలేదని కొన్ని వార్తలు ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ గమనిస్తుంటే అక్కినేని హీరోలు మాత్రం 100 కోట్ల మార్కెట్ ని ఎప్పుడూ తమ సొంతం చేసుకోలేదు. కానీ అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ సినిమాతో 100 కోట్ల క్లబ్ ను చేరుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కు అఖిల్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని అఖిల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా కి అఖిల్ రెమ్యూనేషన్ తీసుకోలేదని తెలుస్తుంది.

సినిమా ఒక్కసారే బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాక అఖిల్ కి షేర్లు అందుతాయి అని కొన్ని సమాచారాల ద్వారా తెలుస్తుంది. మరి ఏజెంట్ సినిమాతో అఖిల్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి. మరి అనుకున్న విధంగా 100 కోట్ల క్లబ్ ను అఖిల్ తన సొంతం చేసుకుంటాడా.. లేదా అనే దానిపై ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -