Balakrishna: నందమూరి మల్టీస్టారర్ లుగా బాలయ్యతోనే సమస్యా.. తారక్ తో నటిస్తారా?

Balakrishna: గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీ.. మల్టీ స్టారర్ సినిమాలకు పెట్టింది పేరుగా మారుతుంది. ఇక డైరెక్టర్లు కూడా.. కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మల్టీ స్టారర్ సినిమాలను బరిలోకి దించడానికి ట్రై చేస్తున్నారు. ఉన్నట్టుండి డైరెక్టర్లు ఈ సినిమాలపై ఎందుకు మోజు పడుతున్నారో అర్థం కావడం లేదు.

ఇటీవల దర్శకు ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ప్రపంచ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ నటన పరంగా కూడా మరో స్థాయిలో పండించారని చెప్పవచ్చు. ఇక రాజమౌళి ఎన్నో ఏళ్లుగా మల్టీ స్టారర్ రూపంలో ప్లాన్ చేసిన త్రిబుల్ ఆర్ సినిమా బాగానే సక్సెస్ అందుకుంది.

ఇక ఇదే క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తండ్రి కొడుకులు.. చిరంజీవి, రామ్ చరణ్ లు కీలక పాత్రలు పోషించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. అదే విధంగా నాగార్జున ఫ్యామిలీ కూడా ఇటీవలే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ నందమూరి ఫ్యామిలీలో హీరోలు మల్టీ స్టారర్ సినిమాలతో ఇప్పటివరకు టాలీవుడ్ బరిలోకి దిగలేదు. నందమూరి అభిమానులు బాలకృష్ణ, ఎన్టీఆర్ లు కలిసి సినిమా ఎప్పుడు చేస్తారో అని ఎదురుచూస్తున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో అసలు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తుంది. ఈ విషయంలో ఎన్టీఆర్ కి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ.. బాలకృష్ణకు ఆసక్తికరంగా లేదన్నట్లుగా తెలుస్తుంది.

నిజానికి కొన్నిసార్లు బాలయ్య, ఎన్టీఆర్ కు చాలా దగ్గరగా ఉంటాడు. మరి కొన్నిసార్లు ఎన్టీఆర్ కి తనకి సంబంధం లేదు అన్నట్లుగా ఇండస్ట్రీలో మెలుగుతాడు. మరి ఈ విషయం గమనించిన నందమూరి అభిమానులు.. నందమూరి ఫ్యామిలీలో మల్టీ స్టారర్లకు బాలయ్య తోనే సమస్యనా అన్నట్లు ఆలోచిస్తున్నారు. మరి దీని గురించి బాలయ్య ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -