Balakrishna: చంద్రబాబు అరెస్ట్ తో బాలయ్య ఫ్యాన్స్ కు భారీ షాక్.. భగవంత్ కేసరి రిలీజ్ సులువు కాదా?

Balakrishna:  టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బాలయ్య బాబు నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అవుతుండడంతో అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్లో ఇంకా కొంత భాగం మిగిలే ఉంది అని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాను పూర్తి చేయాల్సి ఉండగా బాలయ్య బాబు అందుబాటులో లేకపోవడంతో మూవీ షూటింగ్ పెండింగ్ పడిపోయింది. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉండడంతో బాలయ్య హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి నాలుగైదు రోజులైంది.

అక్కడే విజయవాడలో ఫ్యామిలీకి, టీడీపీ కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో ఉంటున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ తో కలిసి రాజమండ్రి వెళుతున్నారు. చంద్రబాబుతో ములాఖత్ అవ్వబోతున్నారు. అయితే ఈరోజే అనిల్ రావిపూడి ఇంకా భగవంత్ కేసరి నిర్మాతలు బాలయ్యని కలవబోతున్నారు. నాలుగైదు రోజులపాటు బాలయ్యతో లింక్ అయ్యి ఉన్న సీన్స్ ఉండడంతో ఆ డేట్స్ కోసం బాలయ్య నుంచి క్లారిటీ తీసుకునేందుకు అనిల్ అండ్ కో బాలయ్య దగ్గరకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది ఒకవేళ బాలయ్య చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చేవరకు అందుబాటులో లేకపోతే భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 నుంచి పక్కకి జరిగే ఛాన్స్ లేకపోలేదు అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -