TRS-Congress: కాంగ్రెస్ కూటమిలోకి టీఆర్ఎస్? కేసీఆర్ రివర్స్ గేర్!

TRS-Congress: సీఎం కేసీఆర్ రివర్స్ గేర్ వేస్తారా? జాతీయ పార్టీలును కాదని ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ వెనక్కి తగ్గుతారా? కేసీఆర్ ప్లాన్ బెడిసికొట్టడంతో చివరికి కాంగ్రెస్ కూటమిలోనే టీఆర్ఎస్ చేరాలల్సిన పరిస్థితి అనివార్యమైందా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి కలిసిన నేతలందరూ కాంగ్రెస్ కే జై కొడుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇక కేసీఆర్ కు కూడా అది అనివార్యమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలను వదిలేసి కేవలం ప్రాంతీయ పార్టీలతో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కలిసి ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. కానీ కేసీఆర్ కలిసిన పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో ఉన్నవే. స్టాలిన్, దేవగౌడ, మమతా బెనర్జీ, నితిష్ కుమార్, ఉద్దవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, కేజ్రీవాల్ ల ను కలిశారు. స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే ఎప్పటినుంచో కాంగ్రెస్ భాగస్వామే. ఇక కర్ణాటకలో కుమారస్వామి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. బీజేపీ చీలిక తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక నితిష్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని బీహార్ లో ఏర్పాటు చేశారు. ఇక ఉద్దవ్ థాక్రే కూడా కాంగ్రెస్ తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఏక్ నాథ్ షిండే రూపంలో శివసేనలో చీలిక వచ్చి ప్రభుత్వం కూలిపోయింది. ఇక శరద్ పవార్ కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో కలిసేందుకు మమత సిద్దంగా ఉున్నట్లు ఇటీవల నితీష్ కుమార్ ప్రకటించారు. ఇక సమాజ్ వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ తో జత కట్టే అవకాశాలున్నాయి.

ఇలా అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కూటమితోనే జాతీయ రాజకీయాల్లో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలోనే చేరుతున్నాయి. దీంతో జాతీయ పార్టీలు లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి అనేది ప్రస్తుత పరిస్ధితుల్లో సాధ్యం కావడం లేదు. దీంతో కేసీఆర్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూటమిలో చేరడం అనివార్యంగా మారింది. ప్రాంతీయ పార్టీలు ఏమీ కేసీఆర్ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో కూడిన థర్డ్ ఫ్రంట్ పై బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ మొగ్గు చూపుతున్నాయి.

దీంతో ఇక కేసీఆర్ కూడా కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో కేసీఆర్ బీజేపీతో కలిసి వెళ్లే అవకాశాలు అసలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలవడం కంటే కేసీఆర్ కు వెళ్లే ప్రత్యామ్నాయం లేదు. జాతీయ రాజకీయాల్లో మోదీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ తో కలవాల్సిన పరిస్థితులు కేసీఆర్ కు తప్పనిసరిగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -