Chandrababu: చంద్రబాబు విజన్ వల్లే ఏపీలో అభివృద్ధి సాధ్యం అవుతుందా?

Chandrababu: రానున్న ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రోజు రోజుకు పైకి ఎత్తుతున్నారు జనాలు. బహుశా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన నచ్చకపోవటం వల్లే ఇప్పుడు చంద్రబాబుపై పడుతున్నట్టు తెలుస్తుంది. ఇక చంద్రబాబు కూడా రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలి అని బాగా పోరాటం చేస్తున్నాడు.

ఓ వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బాగా ప్రచారాలు చేస్తున్నారు. ఇక చంద్రబాబు ఎన్టీఆర్ సపోర్టు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. పైగా జనసేన పార్టీ తరఫున కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అందుతున్నట్లు బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని గద్దె దిగించాలి అని గట్టిగా నిర్ణయించుకొని ఏకమవుతున్నట్లు అర్థమవుతుంది.

 

ఇక తండ్రి గెలుపు కోసం నారా లోకేష్ కూడా పాదయాత్ర చేపట్టి ప్రజల అవసరాల గురించి బాగా తెలుసుకుంటున్నాడు. ఇక ఇంతకాలం జగన్ పాలనలో అభివృద్ధి కనిపించకపోవడంతో జనాలంతా చంద్రబాబుపై ఆశపడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మల్టీ నేషనల్ కంపెనీల విషయంలో బాగా ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు.

 

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలంటే చంద్రబాబు సీఎం అవుతేనే సాధ్యమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు మాత్రమే ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి అని జోరుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ కంపెనీల విషయంలో అప్పులు చేసినట్లు.. అవి తీరక అవి అక్కడికే ముగిసిపోయినట్లు తెలియటంతో ప్రజలు నిరాశ చెందినట్లు తెలిసింది. అదే చంద్రబాబు అయితే ఎటువంటి అప్పులు లేకుండా స్వయంగా తానే పెట్టుబడులు పెట్టే స్తోమత కలవాడని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -