YS Jagan: ఆ ప్లాన్ తో జగన్ కు షాక్ తప్పదా.. ఎన్టీఆర్ ఓడిస్తాడా?

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార వైసీపీ మరియు టీడీపీ, జనసేన మధ్య మాట యుద్ధం సాగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే దీనికి కారణం. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ, ఈ సారి 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకోగా, టీడీపీ, జనసేన మాత్రం ఈ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీని గెలిపించేందుకు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ప్లాన్ వేశారని చర్చ నడుస్తోంది.

 

ఆర్ఆర్ఆర్ తో దేశ, విదేశాల్లో విశేష గుర్తింపు సంపాదించారు తారక్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవర్ సినిమాని దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొన్ని ప్రాజెక్టులకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా మూవీలనే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. మరో వైపు తాత స్థాపించిన టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోందని జూనియర్ భావిస్తున్నారు. రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఈ విషయం అర్ధంవుతోంది. ఈ క్రమంలోనే పార్టీకి చేదోడుగా నిలవాలని జూనియర్ అనుకుంటున్నారని టాక్.

టీడీపీ అధినేత చంద్రబాబు, తనయుడు యువనేత నారా లోకేశ్ ఇద్దరూ పోరాడుతున్నా, సీఎం జగన్ ని ఎదుర్కోలేకపోతున్నారు. తన మార్క్ పాలనతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలోనే జూనియర్ పార్టీలోకి రావాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో ఖమ్మం సభ సాక్షిగా జూనియర్ కి అనుకూలంగా నినాదాలు మారుమోగాయి. తెలంగాణ టీడీపీ పగ్గాలు తారక్ కు అప్పగించాలని డిమాండ్లు వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రలో పార్టీ మనుగడ కష్టంగా ఉంది కాబట్టి, ఇక్కడ ఆయన మార్కు చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.

వైసీపీ అధినేత జగన్ ను ఓడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని తెలిసింది. వైసీపీకి అనుకూలంగా ఉన్ననియోజకవర్గాల్లో టీడీపీ హవా పెరిగేలా ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. ఇది విన్న తెలుగు తమ్ముళ్లుడు జూనియర్ అభిమానలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ఇక తమకి ఓటమి తప్పదని వైసీపీ నాయకులు కూడా భావిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ విని టీడీపీ కార్యకర్తలు సైతం షాకయ్యారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -