Kapu Leaders: వైసీపీలో ఆ కాపు నేతల మాటలకు విలువ ఉంటుందా.. వాళ్లకు ప్రజల్లో విశ్వసనీయత ఉందా?

Kapu Leaders: మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకు ఎంతో విశ్వసనీయత ఉండాలి. ముఖ్యంగా మనం ఒక మాట చెప్పాము అంటే చేయగలం అనే నమ్మకం ప్రజలలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ మనపై ఎంతో నమ్మకం ఉంచుతారు. ముఖ్యంగా ఇలాంటి నమ్మకాలు రాజకీయ నాయకులలో ఉండడం ఎంతో అవసరం. రాజకీయాలలోకి వచ్చే నాయకులందరూ కూడా ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటారు అయితే వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమౌతూ ఉంటారు.

ఇలా మాట ఇచ్చి ఆ మాట తప్పే నాయకులకు ప్రజలలో పెద్దగా విశ్వాసం ఉండదు. ఇకపోతే ప్రస్తుతం ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని సామాజిక పార్టీలు ఒకవైపు అయితే కాపు సామాజిక వర్గం మరొకవైపు ఉందని చెప్పాలి. కాపు అధినేతగా పార్టీ స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.

ఈ క్రమంలోనే కాపు ఓట్లు చీలకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా దోహదం చేస్తాయి ఇలాంటి తరుణంలోనే కాపు నాయకులలో కీలక నేతలగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం హరి రామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఇద్దరు కూడా వైసిపి పార్టీలోకి చేరారు. ఇలా ఈ ఇద్దరికీలకనేతలు వైసిపి పార్టీలోకి చేరడంతో కాపు వర్గానికి చెందిన ఓట్లు అన్నీ కూడా వైసీపీకే వస్తాయని పలువురు భావిస్తున్నారు.

ఇకపోతే ఈ ఇద్దరు కీలక నేతలు వైసిపి పార్టీలోకి చేరిన వీరి మాటలపై ప్రజలలో విశ్వసనీయత లేదని చెప్పాలి. ఎందుకంటే గతంలో వీరు వైసిపి పార్టీపై దూషణలు చేశారు అంతేకాకుండా కాపు ఉద్యమం అంటూ పోరాటం చేసిన ముద్రగడ కాపుల కోసం చేసిందేమీ లేదు ఇలాంటి తరుణంలో వీరు పార్టీ మారడంతో ఈ మార్పు కారణంగా ఓట్లు వస్తాయా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -