Anil: అనిల్ సవాల్ ను లోకేశ్ అంగీకరిస్తారా.. అలా చేయడం సాధ్యమవుతుందా?

Anil: నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వారు సాధించిన ప్రగతిని ప్రజలకి చెప్పటం కాకుండా కేవలం ప్రతిపక్షాలని నిందించటం వారి లోపాలని ఎత్తి చూపించడం అజెండాగా పెట్టుకొని ఎక్కడ అధికారపక్షం పార్టీ పోస్టులు గానీ జెండాలు గాని కనిపిస్తే వాటిని పీకేయడం పనిగా పెట్టుకున్నారు.

అయితే ఇది కొందరు నాయకులకి ఆగ్రహం తెప్పిస్తుంది. ఆధారాలు లేకుండా మాట్లాడటం.. అతని తెలివి తక్కువ తనానికి నిదర్శనం అంటూ లోకేష్ పై నిప్పులు కక్కుతున్నారు అందులో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. లోగేష్ తీరుపై ఆగ్రహంతో ఉన్న అనిల్ కుమార్..

 

తనదైన రీతిలో లోకేష్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే రూపాయి ఎక్కువ ఉన్న వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధం. నెల్లూరు జిల్లా మినహా మరి ఎక్కడ తనకి సెంట్ భూమి కూడా లేదు అని చెప్పుకొచ్చారు.

 

చెన్నైలో తాను అదే ఇంట్లో ఉంటున్నట్టు తెలిపారు నగరంలో తనకు 80 ఎకరాల భూమి ఉందని లోకేష్ ఆరోపించారు కానీ అక్కడ ఉన్నది 13 ఎకరాలు మాత్రమే అందులో కొంత అమ్మి వేయటం జరిగింది.. తనకు 50 కోట్ల ఇల్లు ఉందని చెప్పారు లోకేష్. అయితే అది ఎక్కడ ఉందో చెప్తే అందులో వెళ్లి చేరుతాను అంటూ వెటకారంగా మాట్లాడారు యాదవ్.

 

స్థానిక నాయకులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు కానీ అందులో నిజా నిజాలు గ్రహించలేకపోతున్నారు అంటూ లోకేష్ ని తప్పుబట్టారు. లోకేష్ కి అతని తాత ఇచ్చిన రెండు ఎకరాలతోనే ఇంత ఆస్తి సంపాదించామని దమ్ముంటే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమని సవాల్ విసిరారు అనిల్ కుమార్ యాదవ్. అలాగే లోకేష్ తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించారు. దీనిపై లోకేష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -