Bhuma Mounika: భూమా మౌనిక మినిష్టర్ కావడానికి మనోజ్ ఆ పని చేస్తారా?

Bhuma Mounika: రానున్న ఎన్నికల సందర్భంగా చాలా మంది రాజకీయ నాయకులు పలు నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి కొంతమంది ప్రచారాలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా మనోజ్ భార్య మౌనిక రెడ్డి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అని.. అంతేకాకుండా మనోజ్ తన భార్య కోసం బాగా కష్టపడుతున్నాడు అని తెలిసింది.

 

ఇటీవలే మనోజ్ భూమా మౌనిక రెడ్డిని తమ కుటుంబ సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు. అయితే వీరి పెళ్లి జరిగిన నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ రాజకీయంలోకి అడుగు పెడతాడని జోరుగా వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా ఆయన భార్య మంచు మౌనిక రాజకీయంలోకి అడుగుపెడుతుందని తెలిసింది. దీని కోసం మనోజ్ పలు ఏర్పాట్లు కూడా చేశాడని తెలిసింది. అంతేకాకుండా ఆమె హోమ్ మినిస్టర్ అయ్యేలా ఒక పెద్ద స్కెచ్ కూడా వేశాడట. అయితే తాజాగా మౌనిక ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంటుంది అనే విషయం బయటపడింది.

 

ఆళ్లగడ్డ నుంచి ఆమె పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అని.. ఎలాగైనా వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆమె గెలుపు కోసం మనోజ్ ముందస్తు ప్రచారాలు ప్లాన్ చేసినట్లు తెలిసింది. అది కూడా మంచు ఫ్యామిలీ తో పాటు ఇతర సినీ ప్రముఖులు ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది. ఇక మౌనిక రెడ్డి తన తండ్రి లాగా రాజకీయాలలో ఏలుతుందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -