Kodali: కొడాలి రాజకీయాలకు తారకరత్న భార్య చెక్ పెట్టనున్నారా?

Kodali: వచ్చే ఎన్నికలలో టీడీపీ కీ గుడివాడ నియోజకవర్గం గెలవటం అన్నది ప్రెస్టేజ్ గా మారిపోయింది. కాగా గడిచిన నాలుగు ఎన్నికలలో కొడాలి నాని గెలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొడాలి నాని ఓడించేందుకు చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ఓడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా కొడాలి నాని కి చెక్ పెట్టాలి అని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది నేతల పేర్లను పరిశీలించినా కొడాలిని ఢీ కొనేంత సీనుందని చంద్రబాబు అనుకోవటంలేదు.

ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు అలేఖ్య రెడ్డిని బరిలోకీ దింపే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అలేఖ్య రెడ్డి అంటే మరెవరో కాదు. ఇటీవల మరణించిన నందమూరి తారకరత్న భార్య. రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఎన్టీఆర్ కుటుంబం నుండి ఎవరైనా పోటీకి దిగితే గెలుపు సాధ్యమేమో అనే ఆలోచన కూడా ఉంది. దాంతో తారకరత్న, చైతన్య కృష్ణ, సుహాసిని పేర్లు ప్రచారమయ్యాయి. తారకరత్న పోటీకి బాగా ఆసక్తిచూపారు. అయితే హఠాత్తుగా చనిపోయారు. దాంతో ఇప్పుడు ఆయన భార్య అలేఖ్య రెడ్డిని బరిలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలేఖ్య రెడ్డిని బడిలోకి దింపితే గెలుపు ఖాయమని నందమూరి బాలకృష్ణ సూచించినట్లు తెలుస్తోంది.

బాలయ్య సూచనకు చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారట.

 

అన్నీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అలేఖ్య అభ్యర్ది అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి అలేఖ్య నిజంగానే కొడాలికి గట్టి పోటీ ఇవ్వగలరా? కొడాలి నానిని ఓడించగలరా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుడివాడ టీడీపీలో పెద్ద సమస్య ఏమిటంటే ఎన్నికకు ఒక అభ్యర్ధిని మార్చటమే. 2014లో రావి వెంకటేశ్వరరావు పోటీచేస్తే 2019లో దేవినేని అవినాష్ పోటీచేశారు. రాబోయే ఎన్నికల్లో మరో కొత్త అభ్యర్ధి. ఇందుకనే పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఓడిపోతున్నది. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించకుండా కొత్త అభ్యర్ధులను రంగంలోకి దింపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అలేఖ్య పోటీచేస్తుందని ప్రచారం మొదలవ్వగానే తమ్ముళ్ళల్లో టెన్షన్ మొదలైంది. అయితే అలేఖ్యని పోటీ చేయించడానికి గల కారణం సింపతీ అని కూడా తెలుస్తోంది. మరి ఈ విషయంలో సింపతి వర్క్ అవుట్ అవుతుందా లేదా చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -