Hyderabad: హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ధరలు ఆ రీజన్ వల్లే తగ్గనున్నాయా?

Hyderabad: దేశంలో ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కూడా ఇదే. ఐటీ శరవేగంగా వృద్ధి చెందుతోంది. అంతే వేగంతో పెద్దపెద్ద నివాస బిల్డింగ్ లు కడుతున్నారు. వాటి ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం హైదారబాద్ లో అపార్ట్మెంట్ కు భారీగా ధరలు తగ్గుతాయని తెలుస్తోంది. అదెందుకో చూద్దాం.

తెలంగాణ ప్రభుత్వం పాలసీలు పక్క రాష్ట్రాల ప్రజలను కూడా ఆకర్షిస్తున్నాయి. ఏపీలో చాలా మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం సామాన్యులకు వరంగా మారే అవకాశాలున్నాయి. 1998లో అమలులో ఉన్న జీవో నెం 111ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్ శివారున ఉన్న 84 గ్రామాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి. ఈ ప్రాంతాన్ని అభిృద్ధి చేయాలని భావిస్తుంది ప్రభుత్వం.

 

ఈ జీవో రద్దుతో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్, గండి పేటలో పరిధిలోకి వస్తున్న ఈ గ్రామాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోతో ఇప్పటి వరకు ఈ ప్రాంతమంతా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు దీనికి మహార్దశ రానుంది. దీంతో హైదరాబాద్ నగరం లాగే మరో మహా నగరం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.

 

ఈ జీవో రద్దు తక్కువ బడ్జెట్‌లో భూమి, ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వారికి సదావకాశమేనని చెప్పవచ్చు. బిల్డర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. అంతేకాకుండా నగరంలో కూడా ఫ్లాట్స్ రేట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరో మహానగరం నిర్మించేంత భూమి అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్ రూపు రేఖలు మారిపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -