Veera Simha Reddy: వీర సింహారెడ్డి టైటిల్ బాలయ్యకు తలనొప్పిగా మారనుందా.. వివాదాలు తప్పవా?

Veera Simha Reddy: సాధారణంగా సినిమాలో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకర్షించేది టైటిల్. సినిమా స్టోరీకి అనుగుణంగా దర్శక నిర్మాతలు టైటిల్ సిద్ధం చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో సినిమాలకు పెట్టిన టైటిల్స్ కొన్ని వర్గాల వారిని కించపరిచినట్లు ఉండటం వల్ల వివాదాలకు దారితీస్తున్నాయి. గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూసేవారు.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందటం వల్ల తరచూ సినిమా టైటిల్ విషయంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా టైటిల్ కూడా వివాదాస్పదంగా ఉందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన జాంబిరెడ్డి సినిమా విషయంలో రెడ్డి వర్గానికి చెందిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాంబీలను రెడ్డి వర్గం వారితో పోల్చడం ఏంటి? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇలా కొన్ని వర్గాలకు చెందిన టైటిల్స్ పెట్టడం వల్లే కాకుండా సినిమాలలో కూడా కొన్ని వర్గాలకు చెందిన వారిని మరి నెగిటివ్ గా చూపించడం వల్ల వివాదాలు రేకెత్తాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో ఒక వర్గానికి చెందిన వారే ప్యాషన్ ని ప్రేరేపిస్తున్నట్లు చూపించారు. దీంతో ఆ సినిమా విషయంలో వివాదం తలెత్తింది.

ఇక తాజాగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాకి వీరసింహారెడ్డి అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రని ఈ సినిమా టైటిల్ గా పెట్టారు. అయితే ఇప్పటివరకు ఈ టైటిల్ గురించి ఎక్కడ వివాదాలు తలెత్తలేదు. ఒకవేళ సినిమా కథలో ఏదైనా వర్గానికి చెందిన వారిని కించపరిచినట్లు ఉంటే మాత్రం బాలయ్య సినిమా కూడా వివాదాల్లో నిలవాల్సి వస్తుందేమో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -