NTR: తాతకు తగ్గ మనవడు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకోనున్నారా?

NTR: తెలుగు రాష్ట్రాలు విడిపోయిన అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఏపీ విడిపోవటంతో కొన్ని రాజకీయ పార్టీలకు ప్లస్ కాగా, మరికొన్ని మైనస్ అయ్యింది.
ప్రధానంగా నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం చేకూరింది. విభజన ఏపీలో అధికారంలోకి వచ్చినా, తెలంగాణలో పూర్తిగా పార్టీ నష్టపోయి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు రాష్ట్ర అధ్యక్షులు మారినా, ఆ పార్టీ తలరాత మాత్రం మారలేదు.తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

 

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు త్రిముఖ పోరు నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం యుద్ధాన్ని షురు చేశారు. ఇక బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కూడా హాత్ సే హాత్ యాత్రతో పోరాటం చేస్తోంది. అయితే తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఆ విషయం తెలంగాణ ప్రజల్లో ఉంది. కానీ సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ పగ్గం గడుపుతోందనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అయితే తెలంగాణలో పక్కాగా టీడీపీని యాక్టివ్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ అనుకున్నంత మేర పుంజుకోవటం లేదు.

ఈ క్రమంలోనే చంద్రబాబు వ్యూహాం మార్చాలని తెలుగు తమ్మళ్లు సూచిస్తున్నారు. ఖమ్మం సభలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఏపీని చంద్రబాబు, లోకేశ్ చూసుకోవాలని, తెలంగాణనను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా జూనియర్ తెలంగాణలో చక్రం తిప్పగలరని అంటున్నారు. అందుకే అమిత్ షా కూడా తారక్ ని కలిశారని చెబుతున్నారు. తెలంగాణ టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ చక్రం తిప్పుతారని తాతకు తగ్గ మనవడు అని ప్రూవ్ చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరీ ఏమి అవుతోందో.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -