NTR: బాబాయ్ పై ప్రేమతో.. ఎన్టీఆర్ అక్కడ ప్రచారం చేయనున్నారా?

NTR: రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఆయన నిత్యం రాజకీయాల్లో ఉంటారనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దీనిని కొంత మంది పట్టించుకోవడం లేదు. ఇదొక ఫేక్ వార్తంటూ కొట్టిపారేస్తున్నారు. తాజాగా తారక్ రాజకీయాల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

 

చాలా రోజుల నుంచి ఇటు తెలుగు దేశం పార్టీ నాయకులను, అటు నందమూరి ఫ్యాన్స్ ను వేధిస్తున్న ప్రశ్న ఒకటి ఉంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ఉన్నారా? అనే సందేహం చాలా మందికి ఉంది. దీనికి సంబంధించి గతంలోనే తారక్ క్లారిటీ ఇచ్చారు. తాతపెట్టిన పార్టీని ఎప్పటికీ వదిలేది లేదని తెలిపారు. అయితే ఆ దిశగా ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.

 

మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీకి ప్రచారం చేసే అవకాశం లేదని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. 2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనకు ప్రమాదం జరిగినా కూడా ఆస్పత్రి బెడ్ పై నుంచే పార్టీ కోసం పనిచేశారు.

 

మరోవైపు ఎన్టీఆర్ కు రాజకీయాల్లో అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీలు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్ ఎక్కువగా వినిపించింది. టీడీపీ వర్గాల్లో కూడా ఈ వాదన ఎక్కువగానే వినిపిస్తోంది. ఇప్పుడు కొడాలి నాని, వంశీలు కూడా ఎన్టీఆర్ ను బాబు తొక్కేస్తున్నారంటూ నొక్కి నొక్కి చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి మళ్లీ గెలవడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. బాబాయ్ పై ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ ఈ పని చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కనీసం బాబాయ్ ను గెలిపించడం కోసమైనా ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేయొచ్చనే ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -