Mahesh Babu: వామ్మో.. ఈ వయసులో మహేష్ బాబు ఎనర్జీ ఎలా ఉందో చూశారా?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే ఎనిమిది సినిమాలకు పైగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక రాజకుమారుడు సినిమాతో హీరోగా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు.

ఆపై 28 సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ.. మహేష్ బాబుకి ఇప్పటికీ చెక్కుచెదరని అందం తన సొంతం. కుర్ర హీరోలు ఆశ్చర్యపోయే విధంగా మహేష్ బాబు తన పర్ఫామెన్స్ ని పండిస్తాడు.

ఇక ఇదే క్రమంలో సర్కారు వారి పాట సినిమాతో మహేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ ను అందుకుంది. మహేష్ బాబు అభిమానులకు ఈ సినిమా ఒక మంచి గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే మహేష్ SSMB28 సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ సినిమాకు గాను మహేష్ బాడీ ఫిట్నెస్ కోసం బాగా కష్టపడుతున్నాడు.

ట్రేడ్ మిల్ పై పోటీ పడుతున్న మహేష్ బాబు వీడియో నెట్టింట్లో తెగ హడావిడి చేస్తుంది. 47 ఏళ్ల వయసులో కూడా మహేష్ బాబు ఇంత వేగంగా పరిగెడుతున్నాడని.. తన అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు ఆన్ ఫైర్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ కష్టపడుతున్నందుకు తనని చాలా అభినందిస్తున్నారు.

మరి ఎస్ఎస్ఎంబి సినిమాతో మహేష్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. ప్రస్తుతం మహేష్ కు సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్కేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -