Waltair Veerayya: వాల్తేరు వీరయ్యలో ఆ మార్పు చేసి ఉంటే బాగుండేదా?

Waltair Veerayya: ఈ సంక్రాంతి బరిలోకి మెగాస్టార్ చిరంజీవి తన ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ మీద యుద్ధానికి దిగాడు. సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాల కన్నా భారీ ఓపెనింగ్స్ తో పాటు భారీ కలెక్షన్లతో చిరు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచిగా పర్ఫామ్ చేస్తోంది. అయితే ఈ సినిమా పూర్తిగా చిరంజీవి మీదే నడుస్తుందనుకున్నా.. రవితేజ తనదైన ముద్రతో మెగా ఫ్యాన్స్ ను సైతం మెప్పించాడు.

డైరెక్టర్ బాబి స్టోరీ రాసుకునేటప్పుడే తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన హీరో రవితేజను ఈ సినిమాలో పెట్టాలని అనుకున్నాడట. అందుకు తగ్గట్టుగా కథను సిద్ధం చేయడంతో పాటు రవితేజ కూడా మెగా అభిమాని అవడంతో.. ఈజీగా ఒప్పుకోవడం జరిగిందట. నిజానికి రవితేజ మాస్ మహారాజ కాకముందే చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ రవితేజ సోలో హీరోగా ఎదిగిన తర్వాత వీరిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా రాలేదు.

రవితేజతో చిరంజీవి ఉన్న సీన్లు తెర మీద అందరినీ ఆకట్టుకోగా.. ‘వాల్తేరు వీరయ్య’లో బ్రదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. అయితే నెట్టింట ఇప్పుడు రవితేజ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే సినిమా వేరే లెవల్ లో ఉండేదనే చర్చ సాగుతోంది. మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ కు తోడు, పవన్ కళ్యాణ్ క్రేజ్ తోడైతే అది ఇండస్ట్రీ హిట్ అయి ఉండేదనే టాక్ నడుస్తోంది. అయితే చిరంజీవి బ్రదర్ క్యారెక్టర్ కు సంబంధించిన ఎండింగ్ సీన్ కారణంగా డైరెక్టర్ బాబీకి పవన్ కళ్యాణ్ ను తీసుకోవాలనే ఆలోచన వచ్చి ఉండకపోవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి బ్రదర్ గా రవితేజ నటించగా.. రవితేజ, చిరంజీవిలు ఢీ అంటే ఢీ అన్నట్లు నటించారు. అయితే చివర్లో రవితేజ చనిపోయే సీన్ ఉంటుంది. ఒకవేళ రవితేజ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటే, పవన్ చనిపోయే సీన్ ను ఎవరూ ఊహించుకోలేరు. అందుకే ఈ సినిమాలో ఆ ఒక్క సీన్ లేకపోతే, పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే మాత్రం మెగా అభిమానులకు ఇది ఓ మరుపురాని సినిమాగా మిగిలిపోయి ఉండేదనేది వాస్తవం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -