WTC: ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఖరారు.. మరి టీమిండియా సంగతేంటి?

WTC: ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రవేశపెట్టిన తర్వాత రెండో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రంగం సిద్ధం అవుతోంది. 2021లో తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత్, న్యూజిలాండ్ జట్లు దూసుకెళ్లాయి. కానీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తుపై టీమిండియా కన్నేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు ఫైనల్ బెర్త్ ఖరారైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టును ఆదివారం నాడు ఆస్ట్రేలియా డ్రాగా ముగించడంతో ఆ జట్టుకు ఫైనల్ బెర్తు దక్కింది. మూడు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

 

ప్రస్తుతం 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఇంకా మూడు సిరీస్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో భారత్-ఆస్ట్రేలియా సిరీస్, న్యూజిలాండ్-శ్రీలంక సిరీస్, దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ సిరీస్ ఉన్నాయి. అయితే రెండో బెర్త్ కోసం టీమిండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. ఈ రేసు నుంచి దాదాపుగా దక్షిణాఫ్రికా తప్పుకుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టుకు అవకాశాలు లేవనే చెప్పాలి. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓటమితో దక్షిణాఫ్రికా కథ కంచికి చేరింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్‌లో ఆస్ట్రేలియా (75.56), టీమిండియా (58.93), శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (48.72) వరుసగా నాలుగు స్థానాలలో ఉన్నాయి.

 

అయితే సొంతగడ్డపై త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ టీమిండియాకు కీలకంగా మారింది. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలంటే ఈ సిరీస్ ఓడిపోకూడదు. ఈ సిరీస్‌ను కనీసం 3-1తో గెలిస్తే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. న్యూజిలాండ్‌లో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే ఆ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

భారత్, శ్రీలంక మధ్య టఫ్ ఫైట్
ప్రస్తుతానికి డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో బెర్తు కోసం భారత్, శ్రీలంక తీవ్రంగా పోటీ పడనున్నాయి. ఒకవేళ టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల్లో ఓటమి పాలై.. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే అప్పుడు ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్, శ్రీలంక ఫైనల్లోకి ప్రవేశిస్తాయి. అయితే న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం శ్రీలంకకు అంత సులభమేమీ కాదు. అటు సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియాను క్వీన్ స్వీప్ చేయడం టీమిండియాకు కూడా సులభం కాదనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -