Yatra 2 Vs Pawan Kalyan: యాత్ర2 వర్సెస్ పవన్ కళ్యాణ్ మూవీ.. ఆ సినిమాకు కలెక్షన్లు కష్టమంటూ?

Yatra 2 Vs Pawan Kalyan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత వేడిగా మారుతున్నాయి. అయితే ఎన్నికల సమయానికి ఇంకా సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల కళ వచ్చేసింది. ఒకవైపు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారాన్ని ఉదృతంగా చేస్తున్నాయి. మరోవైపు సినిమాలు వాటికి ఇతోదికంగా సహాయం చేస్తున్నాయి. ఆ విధంగా వైసిపి పార్టీకి బూస్టర్ ఇవ్వడం కోసం ఈ యాత్ర 2 సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ విడుదల కానుంది. కాగా అదే రోజున ప‌వ‌న్ క‌ల్యాణ్ కెమెరామెన్ గంగ‌తో రాంబాబు సినిమాని రీ రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.

 

ప‌వ‌న్ సినిమాల్లో పొలిటిక‌ల్ హీట్ ఉన్న సినిమా.. గంగ‌తో రాంబాబు అందులో పొలిటిక‌ల్ సెటైర్లు బాగా పేలాయి. ఎన్నిక‌ల వేళ‌ ఈ సినిమాని రీరిలీజ్ చేస్తే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి కాస్త హుషారు వ‌స్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. దానికి తోడు యాత్ర 2 సినిమాకు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలని ఉద్దేశంతోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఆ రోజుల్లో బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేదు. కాక‌పోతే రీ రిలీజుల‌కు మంచి గిరాకీ ఏర్ప‌డింది. ఆరెంజ్‌ లాంటి డిజాస్ట‌ర్లు రిలీజ్ చేసినా, జ‌నం బాగానే చూస్తున్నారు. పైగా పొలిటిక‌ల్ సీజ‌న్ ఆయె. అందుకే రాంబాబు మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కానుంది అన్న విషయాన్ని ప్రకటించారు కానీ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్న విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫిబ్రవరి 9న యాత్ర 2కి పోటీగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాల ఒకేసారి థియేటర్లలో విడుదల అయితే యాత్ర 2 సినిమాకు ఒక కలెక్షన్ లు రావడం కష్టమే అని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -