YCP: వైసీపీ నన్ను మోసం చేసింది.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు వైరల్!

YCP: తాజాగా ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీ పై మండిపడ్డాడు. నమ్ముకున్న సొంత పార్టీ వైసీపీ తనను మోసం చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ.. నేను మూడేళ్ల సర్వీసు ఉండగానే ఐఆర్‌ఎస్‌ ఉద్యోగాన్ని వదిలేసి మరి వైసీపీ పార్టీలో చేరాను. నా సొంత ఖర్చులతో ఎన్నికల్లో పోటీచేసి గెలిచాను. ముఖ్యంహా కరోనా సమయంలో కూడా భార్యాబిడ్డలను వదిలి ప్రజల్లో తిరిగాను. ఏలూరు ఎంపీ, పార్టీపెద్దలు అధినేతను ప్రభావితం చేయడంతో పార్టీ నన్ను నడిరోడ్డుపై వదిలేసింది. వైసీపీ నన్ను మోసం చేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు, నాకు విభేదాలు ఉండటంతో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించారు.

 

ఎలీజాకు టికెటిస్తే ఓడిపోతారని ప్రచారం చేసి అభద్రతాభావం కల్పించారు. సర్వేలన్నీ నాకు అనుకూలంగానే ఉన్నాయి. వైకాపా చేయించిన సర్వేలో నాకు 54.62% ఓట్లు వస్తాయని తేలింది. అయిదేళ్లలో ఏటా 350 రోజులు ప్రజలకు అందుబాటులో ఉన్నాను గడప గడపకు కార్యక్రమంలో 216 రోజులు పాల్గొన్నాను. దాదాపుగా 65 వేల కుటుంబాలను కలిశాను. సీఎంకు క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్పకుండా తప్పుదోవ పట్టించారు. ఎంపీ వైపు మొగ్గు చూపి నాకు టికెట్‌ లేకుండా చేసి పొమ్మనకుండా పొగబెట్టారు అంటూ ఎమ్మెల్యే ఎలీజా వైసీపీ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది పెత్తందార్లకు.. పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని సీఎం అనేకసార్లు చెబుతుంటారు.

చింతలపూడిలో నిజంగానే ఆ యుద్ధం జరిగింది. పేదల తరఫున పోరాడుతున్న నన్ను వదిలి పెత్తందారీతనం చేస్తున్న ఎంపీ వర్గం వైపే సీఎం మొగ్గు చూపారు. ప్రస్తుతం టికెట్‌ ఇచ్చిన విజయరాజు ఎంపీ మనిషి. తెదేపా, జనసేన పొత్తులో టికెట్‌ కోసం తిరుగుతున్న అంబేడ్కర్‌ కూడా వాళ్ల మనిషే. ఎవరు గెలిచినా అధికారం తన దొడ్లోనే ఉండాలనే శ్రీధర్‌ భావిస్తున్నారు. సీఎం ఈ పెత్తందారీతనాన్ని అర్థం చేసుకోవాలి అని ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ఉండడం కోసం నేను ఎర్రగుంటపల్లి, సాగిపాడు లో నా సొంత డబ్బులతో రెండు రోడ్లు వేశాను. నాకు టికెట్‌ ఇవ్వట్లేదన్న విషయం బయటకు రాగానే ప్రజలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నాకే ఇవ్వాలని వినతిపత్రం రాసి స్వచ్ఛందంగా 80% పార్టీ కేడర్‌, 50 మంది సర్పంచులు సంతకాలు చేశారు. ఆ పత్రాన్ని వాళ్లు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు ఇచ్చారు. అయినా ఆ వినతిపత్రం సీఎంకు చేరలేదు. భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించుకుంటాను అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఎలీజా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -