YCP: చంద్రబాబును ఓడించే సత్తా వైసీపీకి లేదా.. అసలు సమస్య ఇదేనా?

YCP: సీఎం జగన్ ఆలోచన విధానం, ఆయన ఆలోచన ధోరణి వైసీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా జగన్ రెడ్డి కుప్పం బాధ్యతలు ఇచ్చారు. మంత్రిగా పదవి కూడా ఇచ్చారు. కానీ మంత్రిగా చేయాల్సిందేమీ లేదని, కేవలం కుప్పంలోనే ఉండాలని తెలిపారు. పైగా చాలా కాంట్రాక్టులు కూడా ఇచ్చారు. కుప్పంలో లేకపోతే జగన్ రెడ్డి ఆగ్రహిస్తాడని, తన నియోజకవర్గం, మంత్రిగా బాధ్యతలు ఉన్నా అన్నీ వదిలేసుకుని కుప్పం వీధుల్లో ఎమ్మెల్సీ భరత్ ను పెట్టుకుని తిరుగుతున్నారు.

భరత్ ను గెలిపించండి మంత్రిని చేస్తానని అదేదో పెద్ద ఆఫర్ అన్నట్లుగా చెబుతున్నా టీడీపీ గెలిస్తే అక్కడ ముఖ్యమంత్రి ఉంటారని అక్కడి ప్రజలు మాజీ ముఖ్యమంత్రితో పదవిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రితో టచ్‌లో ఉంటారన్న సంగతిని పెద్దిరెడ్డి గుర్తుంచుకోలేకపోతున్నారు. అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టూరిస్టు బస్సులతో వచ్చిన గెలుపుతో విర్రవీగుతున్న వైసీపీ నేతలు రోడ్డున పడికొట్టుకుంటూ సైకోలుగా తయారయ్యారు. వారి దెబ్బకు కుప్పం ప్రజలందరు భయం భయంగా బతకాల్సి వస్తోంది. కాగా పుంగనూరులో ప్రశ్నించిన వారి ఆస్తులను ధ్వంసం చేయడం,ఇళ్లపై దాడి చేయడం, రౌడీయిజం లాంటివి చేయడం పెద్దిరెడ్డి ప్లాన్.

 

పుంగనూరులో ముఫ్పై వేల దొంగ ఓట్లు ఉన్నట్లుగా తేలింది. ఇన్ని అరాచకాలు చేసే పెద్దిరెడ్డికి కుప్పం పెద్ద టాస్క్ గా మారింది. భరత్ కోసం అంత కష్టపడే బదులు పెద్దిరెడ్డి పోటీ చేస్తే మంచిది కదా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. కుప్పం నుంచి పోటీ చేయొచ్చుగా పెద్దిరెడ్డి ఈ మాటలెందుకు బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -