Uyyalavada : ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ!

Uyyalavada: తాజాగా అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుండగా, ఆ విగ్రహ ఆవిష్కరణను వైసీపీ నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఆవిష్కరణ అడ్డుకోవడం కరెక్ట్ కాదు. రాయలసీమ నడిబొడ్డున కర్నూలు కొండారెడ్డి బురుజు పై ఉరితీసిన నర్సింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దద్దమ్మ వైసీపీ ప్రభుత్వం అంటూ ఒక రేంజ్ లో విడుచుకుపడ్డారు.

 

అనంతపురం జిల్లాలో ఇంత మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు. సోమవారం లోపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే నేనే వచ్చే ఆవిష్కరించుతాను అంటూ సవాల్ విసిరారు. ఊర్ల నిండా ఎవరెవరో విగ్రహాలు పెడుతున్నారు కానీ ఈ ప్రాంత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే రెడ్ల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కు అల్టిమేటమ్ జారీ చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ లేదని ఆపిన కలెక్టర్ అన్న విగ్రహాలకు పర్మిషన్ ఉందా అంటూ కలెక్టర్ ను ప్రశ్నించారు జేసి ప్రభాకర్ రెడ్డి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దుస్థితిలో ఉన్నారు అనంతపురం జిల్లాలోని రెడ్డి ఎమ్మెల్యేలు ఇది సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రెడ్డి వర్గం నేతల్లోనూ చర్చ జరుగుతోంది. వైఎస్ రెడ్డి విగ్రహాలే ఉండాలా ఉయ్యాలవాడవి ఉండొద్దా అన్న ప్రశ్న వస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -