YCP MLA: కార్మికులను నిర్భంధించిన వైసీపీ ఎమ్మెల్యే.. ఇంత ఘోరమా అనేలా?

YCP MLA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీరు చాలా దారుణంగా ఉంది. డబ్బు కోసం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ధన దాహం మితిమీరిందని చెప్పవచ్చు. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కొడిమి జగనన్న లేఔట్ కాంట్రాక్టర్ సర్వర్ జహాన్‌ను బెదిరించి లక్షల రూపాయల డిమాండ్ చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ తాము కప్పం కట్టలేమని చెప్పగా చేతిలో అధికారం ఉందని అతనిపైకి ఏకంగా పోలీసులను పంపించారట.

 

ఇక రంగంలోకి దిగిన అనంతపురం రూరల్ పోలీసులు 11 మంది కార్మికులను అక్రమ నిర్బంధించారు. తమ కూలీల ఆచూకీ లేదని కార్మికులను కాపాడండంటూ పోలీసుల ఉన్నత అధికారులను కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ వేడుకున్నారు. ఎస్పీకి ఈమెయిల్ ద్వారా కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై చేసిన ఫిర్యాదును పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదట్. కాగా ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ కార్మికుల నిర్బంధంపై మాల్దా ఎంపీ ఖాన్ చౌదరి దృష్టికి కార్మికుల కుటుంబ సభ్యులు, కాంట్రాక్టర్ సర్వర్ జహన్ తీసుకెళ్లారు.

దీంతో మాల్దా దక్షిణ ఎమ్మెల్యే నుంచి కార్మికులను కాపాడాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీకి ఎంపీ ఏహెచ్ ఖాన్ చౌదరి ఫిర్యాదు చేశారు. అలాగే ప్రకాష్ రెడ్డి బెదిరింపుల కాల్ లిస్ట్‌ను కలెక్టర్, ఎస్పీకి ఖాన్ చౌదరి పంపించారు. ఈ విషయంపై ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అధికారం ఉంది అని వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి డబ్బు కోసం ఏకంగా ఈ విధంగా బెదిరించడంతో పాటు నిర్బంధించడం లాంటివి చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఉన్నత అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -