YCP MLC: తెలుగుదేశంలోకి మరో వైసీపీ ఎమ్మెల్సీ.. కీలకమైన బీసీ ఓట్ బ్యాంక్ వైసీపీ నుంచి జారిపోయినట్టేనా?

YCP MLC: ఎన్నికల ముందు వైసీపీని వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల అన్ని పార్టీలు సీట్లు సర్థుబాటును పూర్తి చేసుకున్న తర్వాత కూడా వైసీపీని కీలక నేతలు వీడి వేరే పార్టీల్లో చేరుతున్నారంటే.. వారు కూటమి పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్నారని కాదు. ఈసారి వైసీపీ గెలవదు అనే నమ్మకమైనా కావొచ్చు. లేదంటే.. వైసీపీని ఓడించాలనే కోపమైనా కావొచ్చు. టికెట్ కూడా ఆశించకుండా పార్టీలు మారుతున్నారంటే ఈ రెండు కారణాలే అవుతాయి. ఏదైనప్పటికీ వైసీపీ ఓటమికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పగా.. ఇప్పుడు మరో కీలక బీసీ నేత టీడీపీలో చేరనున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీకి రాజీనామా చేశారు త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. అంతేకాదు.. రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి.. ఆ రాజీనామా లేఖను వైవీ సుబ్బారెడ్డికి పంపించారు. ఈనెల 5 లేదా 6న పల్నాడు జిల్లా గురజాలలో జరగబోయే శంఖారావం సభలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జంగా కృష్ణమూర్తితో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వారంతా లోకేష్ సమక్షంలో శంఖారావం సభలో పసుపు కండువా కప్పుకోనున్నారు.

జంగా కృష్ణమూర్తిని వైసీపీ అధిష్టానం పలుసార్లు ఆశ కల్పించి మోసం చేసింది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. గురజాల ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకు వస్తుందని ఆయన భావించారు. గత ఎన్నికల్లో ఆయనకు ఈ టికెట్ రావాల్సిఉంది. కానీ.. జంగా కృష్ణమూర్తిని ఒప్పించి స్థానికేతరుడైన కాసు మహేష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. జగన్ ఆదేశాలతో జంగా కృష్ణమూర్తి.. కాసు మహేష్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. దీంతో.. ఆయన్ని జగన్ శాసన మండలికి పంపించారు. కానీ.. ఈసారి మాత్రం తనకే టికెట్ ఇవ్వాలని కృష్ణమూర్తిని పట్టుబట్టారు. 2024లో పోటీపై గతంలోనే జగన్ హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాట తప్పి.. మళ్లీ కాసు మహేష్ రెడ్డికే అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా.. కనీసం నరసారావుపేట ఎంపీగా జగన్ ఆయన్ని బరిలో దించుతారని ప్రచారం జరిగింది. కానీ.. అది కూడా అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు.

ఆ మధ్య జంగా కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం చేశారు. వైవీ సుబ్బారెడ్డి ఆ పదవి నుంచి తప్పుకున్న తర్వాత జంగాకే అవకాశం కల్పిస్తారని అనుకున్నారు. బీసీ నేతగా మంచి గుర్తింపు ఉన్న జంగాకు టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పిస్తే బీసీల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఆ పదవిని మరోసారి రెడ్డి సమాజిక వర్గానికి చెందిన భూమాన కరుణాకర్ రెడ్డి ఇచ్చారు. ఇలా ఓవైపు బీసీలకు అన్యాయం చేస్తూ మరోవైపు జంగా కృష్ణమూర్తికి ఆశాభంగం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా జంగా కృష్ణమూర్తికి రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కేసీఆర్ కేబినెట్‌లోని బీసీ మంత్రులకు జంగా కృష్ణమూర్తి గురజాలలో సన్మానం చేశారు. ఆ రకంగా గురజాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఆయన ఆకర్షించారు. గత ఎన్నికల్లో బీసీలు వైసీపీకి మద్దతు పలకడానికి అది ఓ ప్రధాన కారణంగా చెబుతారు. అయితే, ఇప్పుడు జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరడంతో.. వైసీపీతో ఉన్న బీసీ ఓటు బ్యాంక్ కు పెద్ద ఎత్తున గండి పడే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -