Gorantla Madhav: గోరంట్ల మాధవ్ సస్పెన్షన్ పై వెనకడుగు.. వైసీపీ భయపడుతుందా?

Gorantla Madhav: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మహిళతో వీడియో కాల్ ద్వారా నగ్నంగా మాట్లడటం కలకలం రేపుతోంది. ఈ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీలో ప్రకంపనలు రేపింది. ప్రతిపక్ష, విపక్షాలు దీనిపై మండిపడుతున్నాయి. గత రెండు రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. బయట ఏ నలుగురు కలిసినా.. ఎంపీ నీచ వీడియోపైనే చర్చించుకుంటున్నారు. ఒక ఎంపీ అయి ఉండి ఇలా నగ్నంగా మహిళకు వీడియో కాల్ చేయడం ఏంటి.. వైసీపీ, ఏపీ రాష్ట్రం పరువు కూడా తీసేశారని ప్రజల్లో చర్చ జరుగుతోంది.

గతంలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ కూడా ఇలాగే మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ దొరికిపోయారు. ఇప్పుడు ఏకంగా ఎంపీనే రాసలీలల వ్యవహారంలో చిక్కుకోవడం ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు రక్షణ కల్పించామని, మహిళలకు కష్టం వచ్చే గన్ కంటే జగన్ ముందు వస్తాడని ప్రభుత్వ పెద్దలు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఒక ఎంపీ ఇలా మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన వ్యవహారం బయటకు వచ్చినా.. వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఎంపీపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

అయితే అడ్డంగా దొరికినా సరే.. ఆ వీడియో మార్ఫింగ్ అంటూ గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తాను బీసీని కాబట్టే ఇలా నగ్న వీడియోలు క్రియేట్ చేసి వేధిస్తున్నారంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాను జిమ్ చేస్తున్న వీడియోను మార్పింగ్ చేసి ఇలా క్రియేట్ చేశారని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గోరంట్ల మాధవ్ ది మార్ఫింగ్ వీడియో కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. మార్ఫింగ్ చేసినట్లు ఆ వీడియో కనిపించడం లేదంటున్నారు. కానీ వీడియో బయటపడిన రోజు గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తలు వచ్చాయి.

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ మాధవ్ పై చర్యలు తీసుకోవడంపై వైసీపీ వెనక్కి తగ్గింది. ఆయనపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ అధిష్టానం భయపడుతుందనే వార్తలు వస్తున్నాయి. తనను సస్పెండ్ చేస్తే పార్టీలోని ఇతర నేతల బండారం బయటపెడతాని మాధవ్ బెదిరింపులకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బీసీ సామాజికవర్గానికి చెందిన ఎంపీ కావడంతో.. ఆ సామాజికవర్గ ఓటర్ల ప్రభావం పడుతుందనే ఆందోళనలో వైసీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల.. వీడియో నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పంపించి నిజాలు నిగ్గుతేల్చే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేయడం లేదు.

దీనిని బట్టి చూస్తే గోరంట్ల మాధవ్ పై సస్పెన్షన్ వేటు వేయడం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ పెద్దల్లో కాస్త భయం ఉన్నట్లు అర్థమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు. మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం.. గోరంట్ల మాధవ్ విషయంలో మాత్రం ఎందుకు వెనక్కు తగ్గుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సస్పెండ్ చేస్తే మాధవ్ తమ గుట్టు బయటపెడతాడనే భయంతో కొంతమంది వైసీపీ నేతలు ఉన్నారట. అందుకే అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ గోరంట్ల మాధవ్ పై రేప్ కేసులు లాంటివి ఉన్నాయి. అయినా ఆయనపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ భయపడుతోందని అంటున్నారు. పార్టీ పరంగా విచారణ చేపట్టిన తర్వాత సస్పెండ్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తారని, ఎంపీ కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని మరికొంతమంది అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -