YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా రిలాక్స్ అవుతున్నాడు అని సమాధానం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన తర్వాత పెద్దగా ఎలాంటి రాజకీయ చర్యలు చేయలేదని చెప్పాలి. అయితే ఈ విషయంలో తెదేపా ఒక అడుగు ముందునే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు ని దృష్టిలో పెట్టుకొని అటు ప్రజల ఇటు రాజకీయ పార్టీలను సానుభూతి సంపాదించుకునే ప్రయత్నంలో పడింది తెలుగుదేశం.

అసలే వైసీపీ మీద మంట తో ఉన్న తెలుగుదేశం నేతలకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారో పుండు మీద కారం చెల్లినట్లుగా మరింత కోపంతో రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికలలో 22 స్థానాల్లో గెలుపొందామని అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేశామని లెక్కల్లో మునిగితేలుతూ భవిష్యత్తులో కూడా అలాంటి ఫలితాలే వస్తాయని గుడ్డి నమ్మకంతో వైసీపీ ఉన్నట్లు కనిపిస్తుంది.

అయితే అది జరిగే పని కాదు అని గ్రహించలేక పోతుంది వైసీపీ. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు మారాయి. తెదేపా, జనసేన కలిసిపోయాయి. ఈ కలయిక వైసీపీ కి ఎంతో కొంత నష్టం కలిగిస్తుంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటో గుర్తించి అందుకు తగ్గట్టు నష్ట నివారణ చర్యలు చేపడితేనే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది. అదే సమయంలో బాబు అరెస్టు చేయటానికి దారితీసిన పరిస్థితి ఏంటి?

స్కిల్ డెవలప్మెంట్లో మాజీ ముఖ్యమంత్రి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో జనానికి వివరించడంలో విఫలమయ్యారు వైసీపీ వర్గం వారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికలలో కచ్చితంగా పడి తీరుతుంది అంటున్నారు రాజకీయ వర్గాలు వారు. ఇప్పుడు నడుస్తున్న కథ చూస్తుంటే కుందేలు తాబేలు కథ గుర్తురాక మానదు. ఎందుకంటే చంద్రబాబు ని అరెస్టు చేసిన ఆనందంలో రిలాక్స్ అవుతుంది వైసీపీ కానీ మెల్లగా పాక్కుంటూ విజయం వైపు అడుగులు వేసే దిశగా కనిపిస్తుంది తెలుగుదేశం. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -