Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని మోసం చేసిన వైసీపీ.. ఏం జరిగిందంటే?

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ గన్నవరంలో కనిపించక 45 రోజులు దాటింది. చంద్రబాబు నాయుడు గురించి ఒంటికాలి మీద లేచే వల్లభనేని వంశీ గొంతు ఇప్పుడు ఎందుకో మూగబోయింది. కారణం తెలియని వాళ్ళు రకరకాల ఊహాగానాలతో విశ్లేషణలు పెరిగిపోతున్నాయి వరుసగా రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ. కానీ ఆ తరువాత ఫ్యాన్ కిందకి మారిపోయారు అప్పటినుంచి చంద్రబాబుని లోకేష్ ని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తూ ఉండేవారు.

 

అయితే ఆయన హైదరాబాదులోనే ఉంటూ అనుచరులతో కూడా టచ్ లో లేకుండా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ వ్యవహారం కూడా పట్టించుకోవడంలేదని ఇంటెలిజెన్స్ సమాచారం. వల్లభనేని వంశీ తను ఎన్నికలలో పోటీ చేయనని రివర్స్లో వైసీపీ హై కమాండ్ పై బెదిరింపులకు దిగుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఆయనకు ప్రత్యామ్నాయని చూడటానికి పార్థసారధిని గన్నవరం నుంచి పోటీ చేయమని చెప్పారు.

ఈ విషయం తెలిసిన తర్వాత వల్లభనేని వంశీ బాగా హర్ట్ అయ్యారు పార్థసారథి వద్దనుకున్న తర్వాత కూడా కొంతమంది పేర్లు పరిశీలిస్తున్నారని తెలియటంతో ఆయన నియోజకవర్గ వైపు కూడా రావటం మానేశారు. అయితే వైసీపీ పెద్దలు వంశీని సంప్రదించినప్పుడు తన వద్ద డబ్బులు లేవని ఎన్నికలలో పోటీ చేయనని చెప్పినట్లుగా సమాచారం జరుగుతుంది ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ ఆయనను పోటీకి దింపాల లేదంటే బాగా డబ్బులు ఉన్న నేతను వెతుక్కోవాలా అని వైసీపీ ఆలోచిస్తుంది.

 

వంశీ వైసీపీలో ఉన్నప్పుడు ప్రతి పార్టీని దుయ్యబడుతూ మాట్లాడటం వలన ఆయన అందరికీ శత్రువు అయిపోయారు వంశీకి మరొక పార్టీలో చోటు దొరకటం మాట పక్కన పెడితే ప్రభుత్వం మారితే ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా కూడా అజ్ఞాతంలోకి పారిపోవాల్సినంత పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో పోరాడి నిలబడ నిలబడవలసింది పోయి ముందే చేతులెత్తేయటం ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -