Yarlagadda Venkata Rao: వంశీకి ఊరమాస్ వార్నింగ్ ఇచ్చిన యార్లగడ్డ వెంకట్రావు.. ఆ రెండూ ఉన్నాయంటూ?

Yarlagadda Venkata Rao:  ఏపీ పాలిటిక్స్ చాలా హీట్ మీద ఉన్నాయి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పార్టీ నేతలు అనుచరుల మధ్య కూడా వివాదాలు చోటు చేసుకోవడంతో ఒకరికొకరు మాస్ వార్నింగ్ ఇచ్చుకుంటూ ఎన్నికల ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం టిడిపి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు పోటి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని వల్లభనేని వంశీకి తన స్టైల్ లోనే యార్లగడ్డ వార్నింగ్ ఇచ్చారు.

వల్లభనేని వంశీకి మాత్రమే కాకుండా ఆయన అనుచరులకు కూడా ఈయన వార్నింగ్ ఇచ్చారు. ఊరిలోని చెరువు మట్టి ఎవరి జోబులలోకి పోతుందో గమనించాలి అంటూ ఈయన తెలిపారు. సోదరులారా మీరు కూడా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి గన్నవరంలో ఉందని తెలిపారు.ఇక యార్లగడ్డ కేవలం వంశీ తన అనుచరులకు మాత్రమే కాకుండా జిల్లా ఎస్పీకి కూడా వార్నింగ్ ఇచ్చారు.

అమెరికా నుంచి వచ్చాడు సౌమ్యుడు వివాదాస్పద రహితుడు అనుకుంటున్నారేమో, జిల్లా ఎస్పీ పేరును కూడా లోకేష్ రెడ్డి బుక్కులో ఎక్కించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలలో అంగ బలం ఆర్థిక బలమే ముఖ్యమైతే ఆ రెండు నా వద్ద ఉన్నాయని యార్లగడ్డ తెలిపారు. కొట్టుకోవడం పరిష్కారం అయితే టీడీపీ నేతలపై దాడిని ఖండిస్తున్నానన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి, పక్కవారి ఆస్తుల లాక్కొనే దౌర్భాగ్య పరిస్థితి గన్నవరంలోనే ఉందని, ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కడపలో కూడా లేవని అన్నారు.

ఇక నారా కుటుంబంపై బూతులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం దీనికి అంతం లేదా బూతులు మాట్లాడటమే సరైనదైతే నేను కూడా రెండు రోజులలో నేర్చుకొని బూతులు మాట్లాడతానని తెలిపారు. రాష్ట్రం అధోగతి పాలయింది ఉపాధి లేఖ రోడ్లు లేక ప్రజలు వలస పోతున్నారు కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ కి రావడం లేదు ఇవన్నీ జరగాలి అంటే తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని యార్లగడ్డ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -