Weight Loss: బరువు తగ్గేందుకు ఆహారపు అలవాట్లను ఇలా చేసుకోవాలి!

Weight Loss: ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బరువు సమస్య వేధిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతుంటారు. కొందరు జిమ్‌కు వెళ్తే.. మరికొందరు అధికంగా వ్యాయామాలతో కసరత్తులు పడుతుంటారు. మరి కొందరు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చని భావించి ఆహారాన్ని మరీ మోతాదులో తీసుకుంటుంటారు. అయినా కూడా ఊబకాయం మాత్రం తగ్గదు. ఊబకాయం అనేది డయాబెటిస్, కేన్సర్‌ వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచే జబ్బు. ఊబకాయానికి ఆహార నియంత్రణ, వ్యాయామం సరిపోదు. వాటితో పాటు ఆహారపు అలవాట్లు కూడా బాధ్యత వహిస్తాయి.

అర్ధరాత్రి తర్వాత కూడా ఆహారం తీసుకుంటే స్థూలకాయం బారిన పడతారని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఓ పరిశోధకుల బృందం వెల్లడించిన నివేదిక ప్రకారం.. అర్ధరాత్రి తింటే కూడా ఊబకాయం పెరిగే అవకాశం ఉంటుందట. జర్నల్‌ సెల్‌ మెటబాలిజంలో అక్టోబర్‌ 4 న ప్రచురించబడిన ఒక అధ్యయనంలో మనం తినే సమయం మన శక్తి వ్యయం, ఆకలి, శరీరం కొవ్వును ఎలా నిల్వ చేస్తుందో ప్రభావితం చేస్తుందని తెలిపారు.

అధిక బరువు, ఊటకాయం విభాగంలో బాడీ మాస్‌ ఇండెక్స్‌ 16 మంది పాల్గొనేవారిని అధ్యయనం చేసింది. అధ్యయనంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక భోజనం ఇవ్వబడింది. వారి భోజన సమయాలు మార్చబడ్డాయి. అధ్యయనంలో ఒక సమూహానికి మొదట ఆహారం ఇవ్వగా, మరొక సమూహానికి 250 నిమిషాల ఆలస్యంతో ఆహారం ఇచ్చారు. ఈ రెండు సమూహాలలో పాల్గొనేవారి నుంచి కణజాల నమూనాలు, వారు తినే సమయం, కొవ్వు పేరుకుపోవడం వంటి వాటిని గుర్తించారు.

తర్వాత తినడం ఆకలిని నియంత్రించే హార్మోన్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనం కనుగొంది. అధ్యయనం ప్రకారం, ఆకలిని నిరోధించే లెప్టిన్‌ స్థాయి, ఆలస్యంగా తినే సమయంలో 24 గంటల్లో తగ్గింది. ఆలస్యంగా తినడం వల్ల ఆకలిగా అనిపించే అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఆలస్యంగా తిన్న వారి కేలరీలను నెమ్మదిగా టర్న్‌ చేస్తారు. లెప్టిన్‌ స్థాయిలు అడిపోజెనిసిస్‌ను పెంచడం, లిపోలిసిస్‌ను తగ్గించడం ద్వారా కొవ్వు కణజాల విస్తరణను పెంచుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -