Pawan Wishes Mahesh: మహేష్ కు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్పాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Pawan Wishes Mahesh: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9వ తేదీ 48 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు రేర్ ఫోటోలను షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఈసారి అభిమానులు వినూత్నంగా మహేష్ బాబు పేరిట ఒక నక్షత్రాన్ని రిజిస్టర్ చేసి తనకు బర్త్డే విషెస్ తెలియజేయడం విశేషం.

మహేష్ బాబు అభిమానులు తమ హీరో పై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు.మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రెటీలు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుని సోదర సమానుడు అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…. శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మహేష్ బాబు కథానాయకుడుగా అందుకున్న విజయాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తన తండ్రి కృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ విభిన్న కథ పాత్రలలో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం.

 

సోదర సమానమైన శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబును సోదర సమానుడు అంటూ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -