Young Tiger Jr. NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం.. లోకేశ్ కు భారీ షాకిస్తూ ఫ్లెక్సీ వైరల్!

Young Tiger Jr. NTR: టీడీపీ నారా లోకేష్ ప్రస్తుతం యువగలం పాదయాత్రలో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. గత కొన్ని నెలలుగా లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీలోని జిల్లాలు,గ్రామాలు మండలాలను సందర్శిస్తూ ప్రజల బాగోగులు కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలోనే భారీగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మామూలుగా టీడీపీ బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించినా కూడా అక్కడ ఎన్టీఆర్ పేరు వినిపించడం అన్నది కామన్.

చాలా మంది టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ కామెంట్లు చేయడంతో పాటు అరుస్తూ ఉంటారు. అయితే ఇలా చాలా సందర్భాలలో నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అంటూ అనేక నినాదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాలు లోకేష్ కి అలాగే చంద్రబాబు నాయుడుకి కూడా ఎదురయ్యాయి. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి ఈ విషయంపై ఎటువంటి స్పందన లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా నారా లోకేష్ కి దిమ్మ తిరిగిపోయే విధంగా ఒక పోస్టర్ నీ అతికించారు.

 

లోకేష్ కు భారీగా షాక్ తీస్తూ ఆ ఫ్లెక్సీనీ కట్టారు. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముంది అన్న విషయానికి వస్తే.. యువగళమైన, జనగళమైన, నవగలమైన.. ఏ గలమైన, తెలుగు నాట స్మరించే పేరు ఒకటే నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం అంటూ భారీగా ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మీమ్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -