NTR: క్యూట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు.. భలే ఉన్నాడుగా?

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా మారిపోయారు.

ఇలా ఎన్టీఆర్ సినీ కెరియర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇలా ఎన్టీఆర్ వృత్తిపరంగా ఎంతో సక్సెస్ కాగా వ్యక్తిగత జీవితంలో కూడా ఈయన చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ఇద్దరు కుమారులు అనే సంగతి మనకు తెలిసిందే. పెద్ద కుమారుడు అభయ్ రామ్ కాగా రెండవ కుమారుడు భార్గవ్ రామ్. ఇతర హీరోల మాదిరిగా ఎన్టీఆర్ తన పిల్లల ఫోటోలను పెద్దగా సోషల్ మీడియాలో షేర్ చేయరు.

ఇక లక్ష్మీ ప్రణతి సైతం ఏదైనా కార్యక్రమాల నిమిత్తం బయటకు వచ్చిన ఈమె మీడియాతో మాట్లాడటానికి పూర్తిగా నిరాకరిస్తారు.అయితే తాజాగా ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చేతితో వేసినటువంటి పెయింటింగ్ చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఫోటో చూస్తున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వదినమ్మ ముందు బుల్లి జూనియర్ ఎన్టీఆర్ కు దిష్టి తీయండి అంటూ సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు.భార్గవ్ రామ్ ఎంతో చూడముచ్చటగా ముద్దుగా ఉన్నారని మరికొందరు ఈ ఫోటోపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. భార్గవ్ రామ్ ఎంతో టాలెంట్ అని ఇదివరకే ఎన్టీఆర్ పలు సందర్భాలలో తెలియచేశారు. అయితే ఈ చిన్నారిని బాల నటుడిగా ఇండస్ట్రీలోకి తీసుకురావచ్చు కదా అన్న అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భార్గవ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -