Koratala: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొరటాల జీవితాంతం రుణపడి ఉండాలా?

Koratala: టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు రచయితగా పనిచేసిన కోరటాల శివ అనంతరం మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కొరటాల అనంతరం వరస హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా పేరు సంపాదించుకున్నారు.

ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొరటాల శివను ఆచార్య సినిమా పాతాళానికి తొక్కేసిందని చెప్పాలి. ఊహించని విధంగా ఈ ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో దాదాపు కొన్ని నెలల పాటు కొరటాల శివ బయటికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా కొరటాల ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బయటకు రాలేదు అంటే ఆయనపై ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో మనకు తెలిసిందే.

 

ఇలా ఒక డిజాస్టర్ సినిమాని చేసిన తర్వాత ఆదర్శకుడితో సినిమా చేయడానికి ఏ హీరో కూడా సాహసం చేయరు అలాగే కమిట్ అయిన సినిమాలను కూడా క్యాన్సిల్ చేసుకునే హీరోలు ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివకు అవకాశం కల్పించారు కావలసినంత టైం తీసుకుని కథను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతని కొరటాలకు అప్పజెప్పారు.సినిమా గురించి అప్డేట్ అడిగినటువంటి అభిమానులపై ఈయన ఆగ్రహం వ్యక్తం చేసి దర్శక నిర్మాతలకు కాస్త సమయం ఇవ్వండి అంటూ కొరటాలకు ఫుల్ బ్యాంకింగ్ ఇచ్చారు.

 

ఎన్టీఆర్ కొరటాల శివకు అవకాశం ఇవ్వడంతో నేడు దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై కొరటాల శివ భారీ అంచనాలను పెంచేశారు.ఇలా తనని నమ్మి ఎన్టీఆర్ తనకు సినిమా ఇవ్వడంతో ఆ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా కొరటాల శివ పైనే ఉంది.ఇలా ఒక డిజాస్టర్ తర్వాత స్టార్ హీరో సినిమా అవకాశం రావడం ఆ అవకాశాన్ని ఇవ్వడం ఎన్టీఆర్ కొరటాల పట్ల నిజంగానే ఓ దేవుడనే చెప్పాలి ఇలా ఈ సినిమా సక్సెస్ అయితే తిరిగి కొరటాల కెరియర్ దూసుకుపోతుందని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -