Hijab Row: ఆ కారణంతో యువతిని అరెస్ట్ చేశారు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయింది..నిజమేమిటంటే!

Hijab Row: ఒక్కో దేశంలో వారి వారి ఆచారాలను పాటించకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇరాన్‌లో హిజాబ్‌ ధరించలేదని ఓ యువతిని పోలీసులు అరెస్టు చేయగా ఆమె కస్టడీలో మృతి చెందింది. ఈ సంఘటనపై ఇరాన్‌తో పాటు ఇతర దేశాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. 22 ఏళ్ల అమిని తన కుటుంబంతో కలిసి ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సందర్శనకు వెళ్లింది. ఆ దేశ మహిళలు కఠినమైన దుస్తుల కోడ్‌ పాటించేలా బాధ్యత వహించే పోలీసులు ఆమె హిజాబ్‌ ధరించకపోవడాన్ని గమనించారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసులు ఆ యువతిని అరెస్ట్‌ చేశారు. అయితే నైతిక పోలీసులు కస్టడీలో ఉన్న ఆమె మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆస్పత్రికి తరలించగా మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ సంఘటన ఇరాన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్‌ కోడ్‌ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ మహిళ కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు కొన్ని వార్తా సంస్థలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు.

ఆ యువతి మరణానికి కారణమైన పోలీసులను చట్టం ప్రకారం శిక్షించాలని నినాదాలు చేస్తూ, డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇరాన్‌లోని అమెరికా ప్రతినిధులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చిత్రహింసలకు గురిచేసి యువతి మరణానికి కారణమైన వారిని న్యాయ వ్యవస్థ ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -