YS Jagan: అభ్యర్థుల జాబితాలో మళ్లీ మళ్లీ మార్పులు చేస్తున్న జగనన్న.. ఓటమి భయం వల్లేనా?

YS Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగబోయే 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు 25 మంది పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా అభ్యర్థుల జాబితాను ఓకే విడతలు ప్రకటించేశారు కానీ అనకాపల్లి ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు అనే విషయం గురించి మాత్రం ప్రకటించలేదు ఈ ఒక్క స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు అయితే తాజాగా ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా వెల్లడించారు.

ఇకపోతే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి పది రోజులు కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల పేర్లను మార్చడంతో ప్రతిపక్ష నేతలకు మరో బలం చేకూరిందని చెప్పాలి. ఇలా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల పేర్లను మార్చడం వెనుక ఓటమి భయమే కారణమని అది విజయానికి సంకేతం అని ప్రతిపక్ష నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బూడి ముత్యాల నాయుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఇక ఇదే విషయాన్ని ఇటీవల జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రకటించారు కానీ ఈయనకు ఎన్నికలలో పోటీ చేయడం ఇష్టం లేదు తన కుమార్తె అనురాధను ఎన్నికల పోటీలో దింపాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికలలో ముత్యాల నాయుడు అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించారు.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో చేసేదేమీ లేక ఇష్టం లేకపోయినా ఈ నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు కానీ ఉన్నఫలంగా ఈయన సీటు విషయంలో మార్పులు చేశారు ఈయనని అనకాపల్లి ఎంపీగా పంపిస్తూ మాడుగుల నియోజకవర్గానికి తన కుమార్తె అనురాధకు టికెట్ ఇచ్చారు. ఈ విధంగా చేసినటువంటి మార్పులను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించారు అయితే ఇలా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడం పట్ల ఆయనలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -