కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులను అయితే ప్రకటించారు. కానీ, ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించలేదు. చాలా రోజుల పాటు మ్యానిఫెస్టో లేకుండానే ప్రచారం సాగించారు. ఆయన ప్రచారంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై సెటైర్లు వేస్తూ కాలం గడిపేశారు. నిజానికి ఎన్నికల్లో మ్యానిఫెస్టో చాలా ముఖ్యం. దాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మేం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అని ఓ పార్టీ చెబితేనే.. ఆ హామీలను చూసి ఓటర్లు ఓటు వేస్తారు. మ్యానిఫెస్టో రిలీజ్ చేయకుండా ప్రజలు ఏం చూసి ఓటు వేయాలి? అన్ని పార్టీల మ్యానిఫెస్టోను ప్రజలు పరిశీలిస్తారు. ఏ పార్టీ ఏం ఇస్తుంది? అని బేరీజు వేసుకుంటారు. ఎవరి వలన ఉద్యోగాలు వస్తాయి? ఏ పార్టీ అభివృద్ధికి ప్రాదన్యతనిచ్చింది అని చూస్తాయి.

ఇలా అన్ని చూసుకున్న తర్వాత.. ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందా? ఇవన్ని పరిశీలంచి ఎవరికి ఓటు వేయాలో ఆలోచిస్తారు. కానీ, అసలు మ్యానిఫెస్టో లేకుండా జనంలోకి వెళ్తే.. ఏం చూసి ఓటు వేయాలి? మొన్నటి అసంబ్లీ ఎన్నికల్లో అదే తప్పు చేశారు. మ్యానిఫెస్టోను విడుదల చేయకుండా.. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉందదు. కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు ఉండవు. కాంగ్రెస్ వస్తే రుణమాఫీ ఉండదని ఆయనకు తెలియకుండానే కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు ప్రచారం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న ఒక్కో అంశం గురించి ప్రస్తావించి వాటిని కాంగ్రెస్ పార్టీ అమలు చేయదని చెప్పారు. కానీ.. తాను ఏం చేస్తానో చెప్పుకోలేకపోయారు. దీంతో.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోకి కేసీఆరే స్వయంగా ప్రచారం చేసినట్టు అనిపించింది. దీంతో.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్లింది. అటు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఎన్నికలకు ముందు విడుదల చేశారు. అది ప్రజల్లోకి వెళ్లే సరికి ఎన్నికలు కూడా అయిపోయాయి. దీంతో అప్పటకే బీఆర్ఎస్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కూడా వైసీపీ.. బీఆర్ఎస్ పందానే ఎంచుకున్నట్టు ఉంది. అభ్యర్థుల ఎంపికలో దూకుడు చూపించిన వైసీపీ.. మ్యానిఫెస్టో విడుదలలో వెనకబడింది. పైగా.. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ హామీ ఇస్తారని ఆశగా చూపించి నాలుగు సిద్ధం సభలకు జనాలను తరలించారు. కానీ, అలాంటి ప్రకటన లేదు. ఇప్పుడు మేమంతా సిద్దం అని బస్సు యాత్ర చేస్తున్నారు. కానీ, ఇప్పటికి కూడా మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడంలో లేదు. టీడీపీ మ్యానిఫెస్టోపై సెటైర్లు వేస్తున్నారు. మహిళలకు చంద్రబాబు ఆర్ధిక సాయం చేస్తాడంట. ఎప్పుడైనా మహిళలకు రూపాయి ఇచ్చాడా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఇవ్వడు అని చెబుతున్నారు. కానీ.. మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం లేదు.

పైగా ఏపీలో గత ఐదేళ్లలో కేవలం సంక్షేమమే జరిగింది. అభివృద్ధి అనే మాటే లేదు. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ లేదా రాజధాని నిర్మాణం. ఉద్యోగ కల్పన అని చెప్పే వాళ్ల కోసం యువత, మధ్యతరగతి ప్రజలు చూస్తున్నారు. జగన్ వాటిని ప్రస్తావించే సాహసం చేయడం లేదు. పోని చంద్రబాబు వస్తే.. తాను చేసిన అభివృద్ధిని అడ్డుకుంటాడని చెప్పడానికి ఈ ఐదేళ్లు జగన్ చేసిన అభివృద్ధి కనిపించడం లేదు. అభివృద్ధి గురించి మాట్లాడే సాహసం జగన్ చేయలేరు. సంక్షేమం గురించి మాట్లాడాలంటే ఇంకా మ్యానిఫెస్టో విడుదల చేయలేదు. దీంతో.. ఏం మాట్లాడాలో తెలియక టీడీపీ మ్యానిఫెస్టోకు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -