Kavitha Arrest: కవిత అరెస్ట్.. బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఏపీ సీఎం జగన్ కూడా భయపడుతున్నారా?

Kavitha Arrest: కవిత అరెస్ట్ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆమె అరెస్ట్‌ను ఎవరూర ఖండించలేదు. కేసీఆర్ గత ఐదేళ్లు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అన్ని పార్టీ అధినేతలను పిలిచి మంతనాలు జరిపారు. కర్నాటకలో జేడీఎస్ తో కలిసి బీఆర్ఎస్ కూడా పోటీ చేయాలనుకుంది. గులాబీ కండువా కూడా కుమారస్వామి కప్పారు. ఇక, పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు డబ్బుల పంచారు. ఇలా కేజ్రీవాల్ తో కూడా సత్సంబంధాలు కొనసాగించారు. మమత బెనర్జీతో కూడా మంచి సంబంధాలనే నడిపించారు. కానీ, కవిత విషయంలో ఒక్కరు అంటే ఒక్కరు కూడా స్పందించలేదు. కేంద్రం చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థల తీరును తప్పు పడుతున్నారే తప్పా.. కవిత అరెస్ట్ ను ఎవరూ ఖండించడం లేదు.

అంతెందుకు గత పదేళ్లుగా కేసీఆర్ తో స్నేహాన్ని కొనసాగించిన జగన్ కూడా స్పందించలేదు. చాలా సార్లు కేసీఆర్.. జగన్ కు అండగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కేసీఆర్ చాలా కృషి చేశారు. హైదరాబాద్ నుంచి వైసీపీ కోసం నిధులు పంపించారు. అదే సమయంలో టీడీపీకి నిధులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇలా అన్ని రకాలుగు జగన్ కు సాయం చేశారు. నాలుగు నెలల క్రితం చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా వైసీపీ అనుకూల వైఖరే బీఆర్ఎస్ తీసుకుంది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ లో నిరసనలు చేస్తే అడ్డుకుంటామని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. జగన్ తో ఉన్న దోస్తీ కారణంగానే ఆయన ఆ ప్రకటన చేశారు. ఆ ఒక్క ప్రకటనతో బీఆర్ఎస్ కు చాలా నష్టం జరిగింది. తెలంగాణలోని టీడీపీ మద్దతుదారులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయలేదు. దీంతో.. హ్యాట్రిక్ కొట్టాలి అనుకున్న బీఆర్ఎస్ ఇంటికి పోయింది. అలా అన్ని రకాలుగా జగన్ కు సాయం చేసినా.. కష్టకాలంలో ఆయన ఒక్కమాట కూడా అనలేదు. కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

చంద్రబాబు, లోకేష్ కూడా కవితకు సంఘీభావం తెలపలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏలో భాగంగా ఉంది కనుక అలా మద్దతు తెలుపలేరు. ఇది ఓ కారణమతే.. అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కన్నూ మిన్నూ కానకుండా చంద్రబాబపై కేసీఆర్, కేటీఆర్ కామెంట్స్ చేశారు. దీంతో.. చంద్రబాబు ఒకింత కవిత అరెస్ట్ ను స్వాగతిస్తారే తప్ప ఖండించరు. పైగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ కామెంట్స్ కూడా టీడీపీని బాగా హర్ట్ చేశాయి. ఇది కూడా ఓ కారణం కావొచ్చు.

కవిత అరెస్టును టీడీపీ ఖండించలేదంటే ఓ కారణం ఉంటుంది కానీ.. చివరికి జగన్ కూడా ఖండించలేదంటే కేసీఆర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్పొచ్చు. జగన్ సైలంట్ గా ఉండటానికి ఓ కారణం ఉంది. ఏపీలోనే వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది. ప్రతిపక్ష కూటమిలో బీజేపీ కూడా వచ్చి చేరింది. ఇప్పుడు కవిత అరెస్టును ఖండిస్తే.. బీజేపీ తనపై కేసులను తిరగదోడుతుందని జగన్ భయం. ఇక వివేకా హత్యకేసు దర్యాప్తు కూడా వేగవంతం చేస్తుందని జగన్ సైలంట్ గా ఉన్నారు. అంతేకాదు.. ఇప్పుడు మాట్లాడితే ఎన్నికల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని జగన్ భయపడుతున్నారు. కారణం ఏదైనా కేసీఆర్ ఇప్పుడు ఒంటిరివారు అయిపోయారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -