Balakrishna: వైయస్సార్ చేసిన సాయం బాలకృష్ణ మరిచిపోయారా.. అందుకే ఇలా?

Balakrishna: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టిందో అప్పటినుంచి ఈ వివాదాలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి.ఈ క్రమంలోని ఈ విషయంపై స్పందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టినంత మాత్రాన ఎన్టీఆర్ స్థాయి తగ్గదు వైఎస్సార్ కీర్తి పెరగదు ఇద్దరూ గొప్ప నాయకులే అంటూ ఎంతో అద్భుతంగా ఈయన ట్వీట్ చేశారు.

ఈ విధంగా తన తాత పేరును తొలగిస్తే ఎన్టీఆర్ ఇలాంటి ట్రీట్ చేయడం ఏమాత్రం భావ్యం కాదు అంటూ పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు. అయితే నిజానికి ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ లోని ప్రతి పదం బాలకృష్ణ నోటి నుంచి రావాల్సి ఉంది.బాలకృష్ణ తన జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నారు అంటే అందులో వైఎస్ఆర్ కూడా ఉండాలి. అప్పట్లో బాలకృష్ణకు వైయస్సార్ చేసిన సహాయం అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడుని వెన్నుపోటు దొంగ అని ఎలా అంటున్నారో వైయస్సార్ సహాయం చేయకపోయి ఉంటే బాలకృష్ణపై కూడా హంతకుడు అనే ముద్ర పడి ఉండేది. గతంలో బాలకృష్ణ తన ఇంటిలో తుపాకీలు పేల్చిన విషయం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రంలోనూ చిత్ర పరిశ్రమలను సంచలనంగా మారింది. అదృష్టవశాత్తు ఆ కాల్పుల నుంచి జ్యోతిష్యుడు సత్యనారాయణ, నిర్మాత బెల్లంకొండ బయటపడ్డారు.

ఇలా బాలకృష్ణ తుపాకిని పేల్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్సార్ ఉన్నారు. అయితే వైయస్సార్ తనకు ఉన్న అధికారంతో బాలకృష్ణను బయటకు రాకుండా జైలులో వేయించి తన కక్ష సాధించుకునేవారు కానీ ఆయన అలా చేయలేదు. శరణు కోరి తన వద్దకు వెళ్తే తాను చేస్తున్న పని న్యాయం కాదని తెలిసినప్పటికీ వైయస్సార్ బాలకృష్ణ జైలు పాలు కాకుండా తనపై హంతకుడు అనే ముద్ర పడకుండా తనని కాపాడారు. ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి బాలకృష్ణకు మెంటల్ అనే సర్టిఫికెట్ ఇవ్వడంతో ఈ విషయంలో తను జైలు పాలు కాకుండా కాపాడారు.

ఇలా వైయస్సార్ చొరవతోనే ఈయన హంతకుడు అనే ముద్ర వేయించుకోలేదని కానీ వైయస్సార్ మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసి చీకటి రాజకీయాలు చేసి 16 నెలల పాటు వైయస్సార్ బిడ్డ, జగన్ మోహన్ రెడ్డిని జైలు పాలు చేశారు. ఇందులో బాలకృష్ణ ప్రమేయం లేకపోయినా ఈ అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయారు.ఇకపోతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పై బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలతో గతంలో ఈయన విషయంలో వైయస్సార్ చేసిన సహాయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -