YS Sharmila: ఆ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్న షర్మిల.. భారతి కష్టపడినా ఫలితం శూన్యమా?

YS Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పోరు నడుస్తోంది. ఎత్తులకు పై ఎత్తులతో పార్టీలు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ పోరాటంలో ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలియదు కానీ.. షర్మిల అడుగు తీసి అడుగు వేస్తే చాలు సెన్సేషన్ గా మారుతున్నారు. ఇప్పుడు వివేకాహత్యకేసును వాడుకొని డైరెక్టుగా తన అన్న జగన్ నే టార్గెట్ చేస్తున్నారు.

వీధిన పడ్డ అభాగ్యురాలిగా ఓటర్లను వేడుకుంటున్నారు. ఏపీలో సెంటిమెంట్ పాలిటిక్స్ బాగా వర్క్ అవుట్ అవుతాయి. ఈ విషయాన్ని షర్మిల బాగా వంటపట్టించుకున్నారు. కొంగుచాచి అడుగుతున్నా.. ఆదరించండి అని షర్మిల వేడుకుంటున్నారు. ఆ దృశ్యాలను చూసినవారు ఎంత కరుడుగట్టి ఉగ్రవాదిని అయినా కాసేపు ఆలోచించేలా చేస్తాయి. ఈ రకమైన ప్రచారంతో జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పులివెందుల ప్రచారంలో షర్మిల, సునీత మహిళా సెంటిమెంట్ ను గట్టిగానే ప్రయోగించారు. వైఎస్సార్ బిడ్డనని .. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అన్న జగన్ రోడ్డున పడేశారని.. మీరే నన్న ఆదుకోవాలని అంటున్నారు.

ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని షర్మిల బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే గతంలో ఇదే సెంటిమెంట్ తో ప్రజల్లోకి వచ్చి వైసీపీని గెలిపించారు. వైఎస్‌ఆర్‌సీపీ పెట్టిన కొత్తలో ఉపఎన్నికల్లో విజయమ్మ, షర్మిల దీనంగా ఉన్న పోస్టర్లు పెట్టారు. జగన్ జైల్లో కటకటాల వెనకున్న బ్యానర్లు వీదివీదిన పెట్టించారు. పేదలను అక్కున చేర్చుకున్న వైఎస్ఆర్ కుటుంబం ఈ రోజు రోడ్డున పడిందని ఊరూరా తిరిగారు. 18 స్థానాలకు గాను అప్పుడు 15 స్థానాల్లో వైసీపీ గెలిచింది. అప్పట్లో అదో సంచలనం. అది కేవలం సెంటిమెంట్ తోనే దాన్ని షర్మిల, విజయమ్మ వర్క్ అవుట్ చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను షర్మిల అన్నపై ప్రయోగిస్తున్నారు. ఆమెకు తోడుగా సునీత కూడా తోడవడంతో సినిమా రక్తికడుతోంది. దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

పైగా పులివెందులతో వైఎస్ఆర్‌తో అనుబంధం ఉన్న ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వారిలో మార్పు వస్తే జగన్ పని అయిపోయిట్టే. జగన్‌కు కూడా షర్మిల బలం, బలహీనతలు తెలుసు. అందుకే అప్రమత్తం అవుతున్నారు. నష్టనివారణ చర్యలు మొదలు పెట్టారు. పులివెందులలో జగన్ కోసం ప్రచారానికి షర్మిలక కౌంటర్‌గా భారతిని దించారు. షర్మిల ఇప్పటికే రెండు ఎన్నికలను ఫేస్ చేశారు. కానీ, భారతి ప్రజల్లోకి వచ్చింది లేదు. మరి షర్మిల దూకుడును సెంటిమెంట్ ను ఆమె ఎలా కౌంటర్ చేస్తారన్నది అనుమానమే. ఎందుకంటే షర్మిల బలమైన వ్యూహాలతోనే ప్రజల్లో తిరుగుతున్నారు. పైగా బాధితులగా ఉన్నారు. షర్మిల, సునీతకు అన్యాయం జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. మరి వాటిని కౌంటర్ చేసే వ్యూహం ఉందా? లేదా? చూడాలి

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -