YS Sunitha: నిందితుడిని పక్కనే పెట్టుకుని అలాంటి కామెంట్లా.. జగన్‌కు సునీత దిమ్మదిరిగే కౌంటర్?

YS Sunitha: గత ఎన్నికల్లో వివేకాహత్యనే ప్రచార హస్త్రంగా వాడుకొని అధికారంలోకి వచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకాహత్య కేసు గురించి చాలా అరుదుగా మాట్లాడారు. ఓ సారి అసెంబ్లీలో దీనిపై స్పందిస్తూ ఓ కన్ను మరో కున్నును పొడుచుకుంటుందా? అని ఆస్కార్ రేంజ్‌లో నటించారు. అంటే.. అవినాష్ రెడ్డి.. వివేకానందరెడ్డిని చంపుతాడా అనేది ఆయన చెప్పాలనుకున్న విషయం. అప్పటికి సీబీఐ పూర్తి విషయాలు వెల్లడించలేదు. అందుకే అలా అన్నారు అనుకోవచ్చు. కానీ, ఆ తర్వాత సీబీఐ చాలా స్పష్టంగా చెప్పింది. దస్తగిరి హత్య చేశాడని.. ఆయన వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పింది. అందుకే అవినాష్ ను అరెస్ట్ చేయడానికి సీబీఐ ప్రయత్నించి విఫలం అయ్యింది. జగన్ తన అడ్డాలో పోలీసులతో పాటు.. తన ప్రైవేట్ సైన్యాన్ని వాడుకొని సీబీఐని బెదిరించారు. ఆతర్వాత అవినాష్ రెడ్డికి బెయిల్ కూడా వచ్చింది. అంటే.. హత్యకు కుట్ర చేసిన నిందితుడికి కోర్టులో బెయిల్ వచ్చింది. ఇది చాలా క్లియర్. ఇంత జరిగిన తర్వాత కూడా జగన్ వివేకాకేసు గురించి మాట్లాడలేదు. ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడితే ఎలా మాట్లాడుతారు? సునీతకు సపోర్టు చేస్తారా? లేకపోతే అవినాష్ రెడ్డికి సపోర్టు చేస్తారా? విచారణలో అన్ని విషయాలు బట్టబయలు అయిన తర్వాత అవినాష్ రెడ్డికి సపోర్టు చేసి అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటారా?అని చాలా మంది అనుకున్నారు.

కానీ, మేమంతా సిద్దం సభలో ఈ అన్ని అనుమానాలకు జగన్ స్పష్టతనిచ్చారు. అవినాష్ రెడ్డి అమాయకుడు అని చెప్పుకొచ్చారు. బాబాయ్ వివేకాన్ని ఎవరు హత్య చేశారో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. హత్య చేసినవాళ్లు దర్జాగా బయట తిరుగుతున్నారని మొసలి కన్నీరు కార్చారు. అంతటితో ఆగకుండా… ఆ హతంకులకు అండగా చంద్రబాబు, ఎల్లో మీడియా ఉందని పాత రికార్డులే తిప్పారు. చంద్రబాబు స్వార్థరాజకీయాల కోసం తనవాళ్లను కూడా వాడుకునంటున్నారని విమర్శించారు. అంటే.. షర్మిల, సునీతను చంద్రబాబు.. వైసీపీకి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారని జగన్ ఆరోపణ. అంటే.. చంద్రబాబు కోసం వైఎస్ సునీత తన తండ్రి హత్యకేసును తప్పుదోవపట్టిస్తారా? అంత నీచానికి ఎవరైనా దిగజారుతారా? హంతకులు ఎవరో? నిందితులు ఎవరో తెలుసుకోకుండా చంద్రబాబు కోసం ఈ హత్యను అవినాష్ పై సునీత నెట్టివేసే ప్రయత్నం చేస్తారా? ఎవరివి స్వార్థ ప్రయోజనాలు? ఎవరివి నీచ రాజకీయాలు? ప్రజలు ఆ మాత్రం ఆలోచించలేరా? సీఎం జగన్ ఓ విషయానికి సమాధానం చెప్పాలి. తన వాళ్లను చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడని చెబుతున్న జగన్.. గతంలో వివేకాను సునీత చంపించిందని ఎందుకు వార్తలు రాయించారు? అవి తన సొంత మీడియాలో మాత్రమే వచ్చిన వార్తలు కాదా? దానికి ఎవరు బాధ్యత పడతారు?

ఇదే విషయాన్ని సునీత కూడా ప్రశ్నించారు ఎవరివి స్వార్థ రాజకీయాలు అని నిలదీశారు. తనతో హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని హంతకుడు చెప్పాడు కదా? ఆమె గుర్తు చేశారు. సీబీఐ కూడా ఈ విషయాన్ని నిర్థారించింది కదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎవరు నిందితుడు అని సీబీఐ చెప్పిందో.. ఆ నిందితుడికే టికెట్ ఇచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తారా? అని సునీత నిలదీశారు. నిందితుడిని పక్కన పెట్టుకొని హత్య చేసింది ఎవరో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని ఎందుకీ నాటకాలు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. హంతకుడు, సీబీఐ కూడా వివేకా హత్యకేసులో నిందితుల వివరాలు చెప్పినా.. ఆ నిందితులనే ఎందుకు వెనకేసుకొని వస్తున్నారని ప్రశ్నించారు. అసలు సీబీఐ విచారణను ఎందుకు అడ్డుకున్నారని సూటిగా ప్రశ్నించారు. విచారణ జరిగితే మీ పాత్ర కూడా వస్తుందని భయమా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ కామెంట్స్ కు జగన్ స్పందిస్తారో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -