YS Sunitha: కడప ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా సునీత లేదా ఆమె తల్లి.. ఇండిపెండెంట్ పోటీ వెనుక లెక్కలివేనా?

YS Sunitha: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కారణమైంది. చంద్రబాబే ఆయన్ని హత్య చేయించారని జగన్ ఆరోపించారు. ఆ వెంటనే ఎన్నికలు ఉండటంతో ఆ సింపతీ బాగా పని చేసింది. అయితే, అదే హత్యకేసు ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుంది. గత ఎన్నికల్లో వివేకాహత్యకేసులో ప్రచార అస్త్రంగా పెట్టుకున్న జగన్.. సీఎం అయిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. అంతేకాదు.. నిందితులను జగన్ కాపాడుతున్నారని.. సీబీఐ విచారణ ముందుకు కదలనివ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అది కూడా ఎవరో చేసింది కాదు. వివేకా కుమార్తె సునీతనే ఈ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో ఆమె జగన్ అంతు చూడటానికి రెడీ అవుతున్నారు. అవినాష్ రెడ్డే వివేకాహత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్నారు. కానీ, ఆయన్ని జగన్ కాపాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరిగితే నిజం ఏంటో తేలిపోతుందని సునీత పట్టుబడుతున్నారు. కానీ, విచారణ వేగవంతం కాకుండా అడ్డుకుంటున్నారని జగన్‌ను ఆమె అనుమానిస్తున్నారు.

అంతేకాదు.. ఈ హత్య చేయించింది కూడా సునీత, ఆమె భర్త అని కూడా వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. దీంతో.. తనకు కోర్టులో న్యాయం జరగదని బావించిన ఆమె ప్రజాకోర్టులో తేల్చుకుంటానని చెబుతున్నారు. కడప ఎంపీగా పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. అందుకే రీసెంట్‌గా ప్రెస్‌మీట్ పెట్టి మరీ వైసీపీకి ఓటు వేయొద్దని ఆమె చెప్పారు. అంతేకాదు.. కడప ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే, ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తారో అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే చాలా రోజుల నుంచి ఆమె కడప నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. మొదట ఆమె టీడీపీలో చేరుతారని జోరుగా చర్చలు జరిగాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటారని అనుకున్నారు. షర్మిల కూడా ఆమెను ఆహ్వానించారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, సునీత మాత్రం ఇండిపెండెంట్‌గానే బరిలో దిగాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆమె కాకపోతే.. ఆమె తల్లిని అయినా పోటీలో దించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒకపార్టీ తరుఫున బరిలో దిగితే మిగిలిన పార్టీలు సపోర్ట్ చేయకపోవచ్చు. అదే.. ఇండిపెండెంట్‌గా అయితే.. అందరి మద్దతు కూడగట్టొచ్చని సునీత ఆలోచన. వివేకాహత్య కేసు విషయంలో అందరి ఆలోచన ఒకటే. సునీతకు వైఎస్ జగన్ అన్యాయం చేశాడని.. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కానీ, ఆమె ఏదో ఒక పార్టీలో చేరితే.. మిగిలన పార్టీలు మద్దతు ఇవ్వకపోవచ్చు. అందుకే ఆమె వ్యూహాత్మకంగా ఇండిపెండెంట్ గా బరిలో దిగడానికి సిద్దం అవుతున్నారు.

ప్రజలు నిందితుల వైపు ఉన్నారా? బాధితుల వైపు ఉన్నారా? అని ఈ ఎన్నికల్లో తేలిపోవాలని ఆమె రంగంలో దిగుతున్నారు. ఇప్పటి వరకు సునీత రాజకీయాల్లో లేరు. తన తండ్రి ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నపుడు కూడా ఆమె పాలిటిక్స్ కు దూరంగానే ఉన్నారు. నిజానికి వివేకానందరెడ్డి మరణించిన తర్వాతే అందరికీ ఆమె తెలుసు. అంతకు ముందు ఓ వైద్యురాలిగా చాలా తక్కువ మందికే తెలుసు. కానీ, ఎంత న్యాయ పోరాటం చేసిన ఉపయోగం లేదని భావించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె వస్తున్నారు. రాష్ట్రమంతా ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీకి రాయలసీమలో మాత్రం భారీ నష్టం తప్పదని చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -