Viveka Murder Case: పోలీసుల అదుపులో వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి.. ఆ కిడ్నాప్ కేసులో పోలీసులకు చిక్కారా?

Viveka Murder Case:  వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరిని ఎర్రగుంట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతని కారులో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు రావడంతో దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెలరోజుల క్రితం కడప జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో దర్యాప్తుకు సంబంధించి దస్తగిరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దస్తగిరి గతంలో కూడా పలు వివాదాలలో చిక్కుకున్నాడు. కొన్ని నెలల క్రితం పులివెందుల జయమ్మ కాలనీలో దస్తగిరి నివాసం ఉండేవాడు. అదే వీధి కి చెందిన బాలుడ్ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బులు విషయంలోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తుంది.

అయితే తనకి ఏమీ తెలియదని, తనపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఆరోపించడం గమనార్హం. అలాగే రైల్వే కోడూరు లోని షాపుల యజమానుల్ని బెదిరించే అక్కడ స్థలాలని ఖాళీ చేయమని తమపై దౌర్జన్యం చేసినట్లు చెబుతున్నారు. ఆ సీన్ మొత్తం వీడియో తియ్యగా అది అప్పట్లో పెద్ద వైరల్ అయింది. ఇక ఇప్పుడు తాజా వివాద సమాచారం ఏమిటంటే అక్టోబర్ 1 లక్ష్మీనారాయణ అనే యువకుడిని ప్రేమించిన యువతి అతనితో పాటు వెళ్లిపోయింది.

అయితే కుటుంబ సభ్యులకు ఫిర్యాదుతో యువతి, లక్ష్మీనారాయణకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఇద్దరినీ ఇంటికి పంపి ఈ నెల 13న కేసు క్లోజ్ చేశారు. అయితే ఈరోజు తెల్లవారుజామున దస్తగిరి రాణీ వనంలోనే లక్ష్మీనారాయణ ఇంటికి యువతి తండ్రితో కలిసి వెళ్ళాడు. కిడ్నాప్ చేసినట్టు 100 కి ఫోన్ చేసి చెప్పాడు లక్ష్మీనారాయణ. దర్యాప్తు సంబంధించి దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉన్నది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -