YS Vivekananda Reddy: ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ వివేకానందరెడ్డి.. నమ్మకపోయినా అసలు నిజం మాత్రం ఇదే!

YS Vivekananda Reddy: దేశ రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు చాలా తేడాగా ఉంటాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క మన తన అనే బేధం ఉండదు. అయితే.. అవి రాజకీయాల వరకు పరిమితం అయితే పర్వాలేదు. కానీ, రాజకీయాల కోసం సొంతవారిని సైతం హత్యలు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం ఏపీలోనే చెల్లింది. గత ఎన్నికలకు ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసు కూడా రాజకీయ కోణంలోనే జరిగింది. అయితే, అది కూడా బయట వారు కాదు.. సొంత మనిషి వైఎస్ అవినాష్ రెడ్డి చేయించారని ఆరోపణలు ఉన్నాయి. హంతకుడు దస్తగిరి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ప్రధానంగా ఈ అస్త్రాన్ని ఏకంగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల బలంగా వాడుతున్నారు.

నిన్నమొన్నటి వరకూ హత్యకేసు నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని విమర్శిస్తూ వచ్చిన షర్మిల ఏకంగా.. ఇప్పుడు అవినాష్ రెడ్డిని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేశారని.. అలాంటి వ్యక్తిని గెలిప్తారా? అని ప్రజలను సూటిగా అడుగుతున్నారు. షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. టికెట్ ప్రకటనకు ముందు హంతుకుల వెనకున్న సూత్రదారులు ఎవరు అని ప్రశ్నిస్తూ వచ్చిన షర్మిల ఇప్పుడు ఏకంగా .. చివరికి వారి నోటి నుంచే అసలు బండారాన్ని బయటపెట్టి కుండబడ్డలు కొట్టేశారు. న్యాయం వైపు తాము ఉంటే…. హంతుకుల వైపు వారి అన్న, ఏపీ సీఎం జగన్ ఉన్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశంగా మారాయి. సొంత అన్నపై షర్మిల, సునీతో దండయాత్ర చేస్తున్నారు. ప్రచారాన్ని మొదలు పెట్టిన ఫస్ట్ డే నుంచే ఊహించని రీతిలో షాకింగ్ కామెంట్స్ చేసి జగన్ కి కంటి మీద కునుకు లేకుండా చేసే రీతిలో విమర్శలు గుప్పించారు. నాలుగు రోజుల కిత్రం బద్వేల్ నియోజకవర్గం అమగంపల్లి బస్సు యాత్రను షర్మిల ప్రారంభించారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్‌ వాడుకుంటున్నారని విమర్శించారు. కడప పార్లమెంట్‌ స్థానం నుంచే ఆమె ఎందుకు పోటీ చేస్తున్నారో షర్మిల వివరిస్తున్నారు.

ప్రచారంలో షర్మిలతో పాటు కుమార్తె సునీత కూడా షర్మిల పక్కనే ఉంటూ.. వివేకానందరెడ్డి హత్యను ప్రజలకు క్షణక్షణం గుర్తు చేస్తున్నారు. వైఎస్ వివేకాను చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరగుతుందని సునీత స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ అంటే వైఎస్ షర్మిల అని ప్రజలంతా దీవించాలని ఆమె కోరుతున్నారు. తన తండ్రి చివరి కోరిక షర్మిలను ఎంపీగా చేయాలని.. ఆయన చివరి కోరికను నెరవేర్చాలని సునీత ప్రజలకు చెబుతున్నారు. ప్రచారం మొదలు పెట్టిన నాలుగు రోజులకే షర్మిల.. జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఆమె ప్రశ్నలకు జగన్ టీ నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే.. మరో నెల రోజులు ఎన్నికల ప్రచారంలో షర్మిల ఇంకెన్ని బాంబులు పేల్చుతారో అని వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా అమరావతి అంశం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ.. షర్మిల ఏపీలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన అస్త్రంగా మారిపోయింది. దీంతో.. గత ఎన్నికల్లో వైసీపీకి పాజిటివ్ గా ఉన్న అంశమే ఈసారి ఆ పార్టీని అధికారం నుంచి దించేస్తుందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -