YS Sowbhagyamma: పులివెందులలో బీటెక్ రవి డ్రాప్ కానున్నారా.. వివేకా భార్య ఎన్నికల్లో పోటీ చేస్తారా?

YS Sowbhagyamma: ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా సంచలనంగా మారిపోయాయి రాష్ట్ర రాజకీయాలలో రోజుకు ఒక సంచలన వార్త వెలుగులోకి వస్తుంది ముఖ్యంగా కడప రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఆధారంగా చేసుకొని పెద్ద ఎత్తున రాజకీయాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ హత్య చేసింది ఎవరు ఏంటి అనే విషయాలు అందరికీ తెలిసినప్పటికీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదంటూ వైయస్ వివేకా కుమార్తె సునీత అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పలు సందర్భాలలో ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే సునీత తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎవరు కూడా ఓటు వేయొద్దు అంటూ ఆమె బహిరంగంగా మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు తన బాబాయిని చంపిన అవినాష్ రెడ్డికి పోటీగా షర్మిల కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల అవినాష్ కి పోటీగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు ఈమెకు సునీత పూర్తి మద్దతు తెలిపారు.

ఇదిలా ఉండగా పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి పై కూడా పోటీగా వైఎస్ కుటుంబం నుంచి మరో అభ్యర్థి రాబోతున్నారని తెలుస్తుంది. వైయస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ జగన్ పై పులివెందులలో పోటీకి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల బరిలోకి రాబోతున్నట్టు సమాచారం.

ఇక ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటిస్తే టిడిపి అభ్యర్థిగా ఎన్నికల పోటీలోకి దిగినటువంటి బీటెక్ రవి ఎన్నికల బరిలోనే కొనసాగుతారా లేకపోతే వైయస్ వివేకానంద రెడ్డి పై ఉన్నటువంటి సానుభూతితో ఈయన విత్ డ్రా అవుతారా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -