Vivekam Movie: వివేకం సినిమాపై కొనసాగుతున్న ఉత్కంఠ.. గురువారం కోర్టు ఏం చెబుతుంది?

Vivekam Movie: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఆధారంగా తీసిన వివేకం సినిమాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను నిలిపివేయాలని ఈ కేసులోని నిందితుడు, అప్రూవర్ గా మారిన దస్తగిరి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా వివేకం సినిమా ఎలా ప్రదర్శిస్తున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది. నియమ నిబంధనలు లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే వ్యక్తుల హక్కుకు హక్కులకు భంగం కలగదా అని హైకోర్టు ప్రశ్నించింది.

సీబీఐకి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ సినిమా తీశారని దస్తగిరి కోర్టుకు తెలిపారు. వివేకాకేసు ఇంకా కోర్టులో ఉండగా.. హత్యఘటనపై సినిమా తీయడం సరికాదని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈసినిమాలో తన పేరును వాడటం తన పరువుగు బంగం కలుగుతుందని చెప్పారు. వివేకం సినిమా అన్ని ఓటీటీ వేదికల్లో ప్రదర్శిస్తున్నారంటూ పిటిషన్‌లో దస్తగిరి పేర్కొన్నారు. పులివెందుల నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని వివేకం సినిమా కారణంగా తన హక్కులకు భంగం కలుగుతుందని దస్తగరి పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్షణమే సినిమాను నిలిపేసేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. అయితే వివరణ తీసుకోవడానికి ఒక్క రోజు గడువు కావాలని న్యాయవాది కోరటంతో.. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందా అన్ని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ బేస్డ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే జగన్ కు అనుకూలంగా యాత్ర 2, వ్యూహం, శపథం సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు వైసీపీ మైలేజ్ ను పెంచేందుకు తీశారు. వివేకం సినిమా జగన్ కు వ్యతిరేకంగా ఉంది. ఈ సినిమా ప్రభావం వైసీపీపై బలంగా పడేలా కనిపిస్తోంది. వివేకానందరెడ్డి హత్యకేసు నేపథ్యంలో తీసిన సినమా ఇది. వివేకాహత్య ఎలా జరిగింది అనే దానిపై చాలా మంది క్యూరియాసిటీ ఉంది. మొదట చంద్రబాబే వివేకాను హత్య చేశారని జగన్ ప్రచారం చేశారు. ఆతర్వాత సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి చంపించారని తేలింది. వివేకాతో జగన్ కు ఉన్న గ్యాప్ కారణంగానే ఈ హత్య జరిగిందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనే విషయాన్ని ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. ఈ సినిమా వలన వైసీపీకి చాలా డ్యామేజ్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై ఈ హత్యను నెట్టి లాభపడ్డారు. కానీ. ఈ సినిమా చూసిన తర్వాత నిజం ఏంటో తెలుస్తుంది. అసలు కడప ఎంపీ విషయంలో ఏం జరిగింది? ఎన్నికల సమయంలో అర్థరాత్రి చంపాల్సిన అవసరం ఏంటీ అని పూసగుచ్చినట్టు సినిమాలో చూపించారు. కాబట్టి వివేకం సినిమా వైసీపీ ఇమేజ్ ను పాతాళానికి తొక్కుతుందని అనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -